Tarun Chugh: బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బండి సంజయ్ యాత్రపై టీఆర్ఎస్ చేసిన దాడిని తెలంగాణ బిజిపి వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఖండించారు. ఎన్టీవీతో మాట్లాడారు. బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గుండాలతో సంజయ్ యాత్రను ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు తరుణ్ చుగ్. పోలీసుల తీరు సైతం సరిగ్గా లేదని విమర్శించారు. ముఖ్యమంత్రులు వస్తారు పోతారు.. పోలీసులు న్యాయం వైపు ఉండాలని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీలో చేరికలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరుతున్నారని గుర్తు చేశారు. అమిత్ షా సభపై రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలిపారు.
అయితే నిన్న జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో బీజేపీ నేతలపైకి టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈనేపథ్యంలో..రెండు గంటలకు పైగా సాగిన ఈ ఆందోళనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా.. ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
Bihar Cabinet Expansion: బిహార్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 31 మంది ప్రమాణస్వీకారం
Also Read
- Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
- Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
తాజావార్తలు
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
-
India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!