బండి సంజయ్ యాత్రపై టీఆర్‌ఎస్ చేసిన దాడిని తెలంగాణ బిజిపి వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఖండించారు. ఎన్టీవీతో మాట్లాడారు. బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్‌ఎస్ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ గుండాలతో సంజయ్ యాత్రను ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు తరుణ్ చుగ్. పోలీసుల తీరు సైతం సరిగ్గా లేదని విమర్శించారు.…