'Shakti' remarks: ఇటీవల ముంబై వేదికగా జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇండియా కూటమి నేతలు హాజరైన ఈ మెగా ఈవెంట్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఈవీఎం)లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు బుధవారం బీజేపీ ఫిర్యాదు చేసింది.
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ ముంబైలో జరిగింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి నేతలు బలప్రదర్శనకు వేదికగా నిలిచింది. ముంబైలోని శివాజీ పార్కులో ఈ సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, స్టాలిన్, ఫరూఖ్ అబ్దుల్లా వంటి నేతలు హాజరయ్యారు.