BJP: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్‌ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. మోడీని ‘‘సంఘీ’’ అంటూనే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉగ్రవాదులు అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీజేపీకి చెందిన డానిష్ ఇక్బాల్ కన్హయ్య కుమార్‌పై ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీ ఆదివారం అతడిపై పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.