దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ అంశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. “డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త. పార్టీలకతీతంగా గౌరవించే వ్యక్తి. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి మా పార్టీ మద్దతు ఇచ్చింది. ఈరోజు అసెంబ్లీలో డాక్టర్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యను మేము అభినందిస్తున్నాం. భారతదేశానికి గౌరవప్రదంగా సేవ చేసిన ఏకైక ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అని తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పీవీ నరసింహ స్మారకం కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ” అని వ్యాఖ్యానించారు.
READ MORE: AP Liquor Sales: ఏపీలో భారీగా లిక్కర్ సేల్స్.. రూ.6,312 కోట్లు తాగేశారు..!
ఇదిలా ఉండగా.. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. అసెంబ్లీలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పని చేశారని చెప్పారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి విశేషమైన సేవలందించారని పేర్కొన్నారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారని రేవంత్ రెడ్డి వివరించారు.
READ MORE: World’s Best Actors: ప్రపంచ ఉత్తమ నటుల జాబితా విడుదల.. భారత్ నుంచి ఒకే ఒక్కరు..
#WATCH | Hyderabad | On Telangana Assembly passing resolution seeking Bharat Ratna for late former PM Dr Manmohan Singh, BRS leader KT Rama Rao says, "Dr Manmohan Singh was a great economist. He is someone who is respected across party lines. Our party supported the resolution… pic.twitter.com/yQDOkY5zDY
— ANI (@ANI) December 30, 2024