Kerala: కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర.. తొలిసారి తిరువనంతపురంలో..!
- కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర
- వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టిన కాషాయ పార్టీ
- అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బూస్టింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టింది. తొలిసారి తిరువనంతపురం మేయర్ స్థానాన్ని కాషాయ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ నేత వీవీ.రాజేష్ మేయర్‌గా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లు వీవీ.రాజేష్‌ను మేయర్‌గా ఎంచుకున్నారు. దీంతో కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బూస్ట్ వచ్చినట్లైంది.
ఇది కూడా చదవండి: Lalu Prasad Yadav: లాలూ ఫ్యామిలీకి ఝలక్.. ప్రభుత్వ బంగ్లా నుంచి వస్తువులు తరలింపు!
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
వీవీ.రాజేష్‌కు 50 మంది బీజేపీ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర సభ్యుడు మద్దతు తెలిపారు. దీంతో రాజేష్ మేయర్‌గా ఎన్నికై కొత్త చరిత్ర సృష్టించారు. ఇక యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరినాథన్కు 17 ఓట్లు, ఎల్డీఎఫ్ మేయర్ అభ్యర్థి ఆర్పీ శివాజీకి 29 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వామపక్షాల కంచుకోటను బీజేపీ బద్ధలు కొట్టింది.
వీవీ.రాజేష్ బ్యాగ్రౌండ్ ఇదే..
వీవీ.రాజేష్ (50) ప్రస్తుతం తిరువనంతపురం కార్పొరేషన్లో కౌన్సిలర్‌గా రెండోసారి పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొడుంగనూర్ వార్డు నుంచి 515 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వృత్తిరీత్యా న్యాయవాది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. గతంలో తిరువనంతపురం జిల్లా అధ్యక్షుడిగా.. బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వట్టియూర్కావు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 39,596 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. సీపీఐ(ఎం) అభ్యర్థి వీకే ప్రశాంత్‌పై ఓడిపోయారు. 1996 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. పార్టీ నిర్మాణం, ప్రజా జీవితంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈ నేపథ్యమే మేయర్‌గా ఎన్నిక కావడానికి దారి తీశాయి.
Meet the BJP/NDA candidates for Mayor and Deputy Mayor of Thiruvananthapuram – Shri VV Rajesh and Smt. Asha Nath.
Both are committed karyakartas who are committed to serve the people of our capital city and solve the unsolved problems of decades.
And realize our goal of… pic.twitter.com/fwRrTaMmqB
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) December 25, 2025
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..