కోరికలు లేని మనిషి ఉండడు.. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఏదో ఒక తీరని కోరిక మిగిలిపోతూనే ఉంటుంది. తాను బతికున్న రోజుల్లోనే అన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడతారు.. దాని కోసం దేవుళ్లు చుట్టూ తిరుగుతారు.. మొక్కులు, యాగాలు, పూజలు, పుణ్యస్నానాలు ఇలా ఏవేవో చేస్తూ ఉంటారు. పోనీ ఆ కోరికలు ఏమైనా మాములుగా ఉంటాయా..? అది లేదు.. తాజాగా అమ్మవారి హుండీలో వేసిన ఆ వింత కోరికలు చూస్తే మైండ్ పోవాల్సిందే..
కర్ణాటకలోని హాశానాంబ ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలది. అక్కడ అమ్మవారిని ఏది కోరితే ఆ కోరిక నెరవేరుతోంది అనేది గట్టి నమ్మకం.. సంవత్సరంలో తొమ్మిది రోజులు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది.. మిగతా ఏడాది మొత్తం మూసివేయబడుతుంది. దీంతో ఆ తొమ్మిది రోజులు అక్కడ పండగ వాతారణం మొదలవుతుంది. లక్షలమంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలు కడతారు. ఇక తాజగా ఆలయాన్ని తెరవడంతో భక్తులు తమ తమ కోరికల చిత్తలతో అమ్మవారి ముందు ప్రత్యక్షమయ్యారు.
తమ కోరికలను ఒక చీటీలో రాసి అమ్మవారి హుండీలో వేశారు. ఇక ఇటీవల హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆ వింత కోరికల లేఖలు బయటపడ్డాయి. మా ఊరికి రోడ్లు వేయిస్తే.. రూ. వేలు కానుక ఇస్తా అని ఒక వ్యక్తి రాయగా.. మరో వ్యక్తి మా ఎమ్మెల్యే మారిపోయేలా చూడు స్వామీ అని రాశారు. ఒక యువతి తన ప్రేమను ఇంట్లో వారు అంగీకరించేలా చూడామని రాయగా.. ఓకే ఆకతాయి కుర్రాడు పక్కింటి ఆంటీ నాకు పడేలా చూడు దేవుడా.. అని రాశాడు. ప్రస్తుతం ఈ విచిత్ర లేఖలు నెట్టింట వైరల్ గా మారాయి.