Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ అతి తీవ్ర తుఫానుగానే కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా తీరానికి చేరువగా కదులుతుండటంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. అతి తీవ్రమైన తుఫాన్ గురువారం మధ్యాహ్నం గుజరాత్ లోని కచ్ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకనుంది. తీరాన్ని తాకే సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని భాతర వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర తుపానుగా మారిన బిపర్జోయ్ తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
Read also: Tech Tips: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లపై హ్యాకర్ల నజర్
తుఫాను తీవ్రత పెరిగితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజా భద్రతకు భరోసా కల్పించాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ లు 24 గంటలూ పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్న ఈ తుఫాను గుజరాత్ లోని పోర్ బందర్ కు నైరుతి దిశగా 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది జూన్ 15న కచ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను దృష్ట్యా అధికారులు సముంద్ర తీరాల జిల్లాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్ దక్షిణ, ఉత్తర తీరాల్లో చేపల వేట కార్యకలాపాలను నిలిపివేశారు.
Read also: LIC Scheme: అదిరిపోయే స్కీమ్.. నెలకు రూ.10,000 సులువుగా పొందవచ్చు..
బిపర్జోయ్ తుఫాన్ కారణంగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గాలుల ఉద్ధృతికి కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయగా.. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలకు ల్యాండింగ్‌కు పరిస్థితి అనుకూలించకపోవడంతో దారిమళ్లిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర తుపానుగా మారిన బిపర్జోయ్ తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షితంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ప్రధాని అధికారులను ఆదేశించారు. విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, ఆరోగ్యం, తాగునీరు వంటి అన్ని అత్యవసర సేవల నిర్వహణ ఉండేలా చూడాలని ఆదేశించారు. వాటికి నష్టం వాటిల్లితే వెంటనే పునరుద్ధరించేకు ఏర్పాటు చేయాలన్నారు.
Read also: Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి.. స్వగ్రామానికి పార్థివదేహం
తుఫాను తీవ్రత పెరగడంతో నగరంలో బలమైన గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో సాయంత్రం ముంబైలో విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయి నేపథ్యంలో కొన్ని రన్‌వేలను తాతాల్కికంగా మూసివేశారు. దీనిపై ఎయిరిండియా (Air India) ట్వీట్ చేస్తూ ‘‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబయి విమానాశ్రయంలోని 09/27 రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు.. కొన్ని విమానాలు ఆలస్యం కావడం.. మరికొన్ని రద్దయ్యాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. అంతరాయాన్ని తగ్గించేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఎయిరిండియా తెలిపింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే విమానాల రాకపోకల్లో జాప్యం జరుగుతున్నట్లు పేర్కొంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 135-150 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కచ్, సౌరాష్ట్రలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో జూన్ 15 వరకు అరేబియా సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.