BJP: బీహార్‌లో ఎన్డీయే కూటమి సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది. 243 సీట్లలో ఏకంగా 190+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఆర్జేడీ+కాంగ్రెస్ పార్టీల ‘‘మహాఘట్బంధన్’’ కూటమి ఘోర పరాజయం దిశగా వెళ్తోంది. కేవలం 50 లోపు స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వడం తేజస్వీ యాదవ్, రాహుల్ గాంధీలను షాక్‌కు గురిచేస్తోంది. బీహార్ ఎన్డీయే విజయంపై బీజేపీ, జేడీయూ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Bihar Election Results: బీహార్ ఫలితాల్లో అమిత్ షా చెప్పిందే నిజమైంది..
ఇదిలా ఉంటే, ఎన్డీయే మెజారిటీ స్థానాలను గెలుచుకోబోతున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బీహార్‌ను గెలుస్తున్నామని, తమ నెక్ట్స్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని ఆయన అన్నారు. బీహార్ ప్రజలు అరాచక ప్రభుత్వం రావొద్దనే నిర్ణయం తీసుకున్నారని, బీహార్ యువత తెలివైన వారని, ఇది డెవలప్మెంట్ విజయం అని అన్నారు. బీహార్ ప్రజలు అవినీతి, దోపిడి ప్రభుత్వాన్ని అంగీకరించదని ఆయన చెప్పారు.