Health Tips: అన్నం Vs చపాతీ.. డయాబెటిస్ పేషెంట్స్‌కు ఏది మేలు? వైద్యులు చెబుతున్నది ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips: మధుమేహం (డయాబెటిస్) బారిన పడిన వారు డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న.. “అన్నం తినాలా? లేక చపాతీ తీసుకోవాలా?” అని. చాలా మంది అన్నం మానేసి చపాతీ తింటేనే షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని గట్టిగా నమ్ముతుంటారు. మరి వైద్యులు ఏమంటున్నారు? అసలు ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఏది తింటే వారి ఆరోగ్యం బాగుంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Hyderabad News: హైదరాబాద్ ఊపిరి ఆగుతోంది.. బాం*బు పేల్చిన IIT కాన్పూర్ అధ్యయనం!
Also Read
- Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ.. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు) ఎంత ఉన్నాయి అనేదే కీలకం అని వివరించారు. ఒక కప్పు అన్నంలో దాదాపు 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అదే ఒక్క చపాతీలో కేవలం 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. పైగా చపాతీలో పీచు పదార్థం (ఫైబర్) అన్నంతో పోలిస్తే ఒక 2 గ్రాములు ఎక్కువగా ఉంటుందని వివరించారు. నిజానికి చాలా మంది అన్నం తింటే షుగర్ పెరుగుతుందని భయపడతారు. కానీ ఇక్కడ పదార్థం కంటే ‘క్వాంటిటీ’ (పరిమాణం) ముఖ్యమని చెబుతున్నారు. ఒక కప్పు అన్నానికి బదులుగా రెండు చపాతీలు తీసుకుంటే శరీరానికి సమానమైన శక్తి అందుతుందని వెల్లడించారు.
సాధారణంగా డయాబెటిక్ పేషెంట్లలో ఒక అలవాటు ఉంటుంది. అన్నం తినేటప్పుడు ప్లేటులో ఎంత వేసుకుంటున్నామో అన్న దానిపై స్పష్టమైన నియంత్రణ ఉండదు. కానీ చపాతీ విషయానికి వస్తే, రెండు చపాతీలు తిన్న తర్వాత ఆపేయడం సాధ్యమవుతుంది. రాత్రి వేళల్లో (Dinner) మితంగా తినడం ముఖ్యం కాబట్టి, రెండు చపాతీలతో భోజనం ముగించడం డయాబెటిక్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏది తిన్నా మితంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మీరు అన్నం ప్రియులైతే మీరు తినే అన్నం పరిమాణాన్ని ఒక కప్పుకు పరిమితం చేయాలని, క్రమశిక్షణతో కూడిన భోజనమే మధుమేహానికి అసలైన విరుగుడని వెల్లడించారు.
READ ALSO: Raghunath Reddy: టాలీవుడ్‌లో విషాదం.. కొడుకు చనిపోయిన నెల రోజులకే తెలుగు నటుడు మృతి
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!