Yogi Government: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం సారూ.. 68 వేల మంది ఉద్యోగులకు ‘నో శాలరీ’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Government: ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చడానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆస్తి వివరాలను కోరింది. కొందరు వివరాలను సమర్పించగా, 68 వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాన్ని పట్టించుకోలేదు. దీంతో సుమారు 68 వేల మంది ఉద్యోగుల జీతాలను యూపీ ప్రభుత్వం నిలిపివేసింది.
READ ALSO: Jogi Ramesh: ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారు.. జోగి రమేష్ ఫైర్
Also Read
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
ఈ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను అందించే వరకు వారికి జీతాలు చెల్లించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఉద్యోగులందరు త్వరలో వారి ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి అందిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1956 ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమాలలోని 24వ నిబంధన ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 8,66,261 మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ 2025 సంవత్సరం వరకు తమ చరాస్తులు, స్థిరాస్తుల వివరాలను ఈ ఏడాది జనవరి 31 నాటికి మానవ్ సంపద పోర్టల్‌లో సమర్పించాలి. ఇప్పటికే అన్ని విభాగాల నోడల్ అధికారులు, చెల్లింపు అధికారులకు ప్రభుత్వం తగిన సూచనలు జారీ చేసింది. జనవరి 31 నాటికి ఆస్తి వివరాలను అప్‌లోడ్ చేయని వారి జీతాలను కూడా నిలిపివేస్తామని ముందే స్పష్టం చేసింది.
ఈ ఉత్తర్వు అందిన తర్వాత కూడా, శనివారం రాత్రి వరకు 68,236 మంది రాష్ట్ర ఉద్యోగులు మానవ్ సంపద పోర్టల్‌లో వారి ఆస్తుల వివరాలను అప్‌లోడ్ చేయలేదని సమాచారం. ఆస్తి వివరాలను అందించని వారిలో అత్యధికంగా 34,926 మంది ఉద్యోగులు మూడవ వర్గానికి చెందినవారే. వీరితో పాటు, 22,624 మంది ష్ట్ర ఉద్యోగులు క్లాస్ IV కి చెందిన వారు ఉండగా, 7204 మంది క్లాస్ II, 2628 మంది క్లాస్ I అధికారులు ఉన్నారని పలు నివేదికలు వెల్లడించాయి. అలాగే 1612 మంది ఇతర ఉద్యోగులలో, 854 మంది తమ ఆస్తులను ప్రకటించలేదు, దీంతో వారి జీతాలను యోగి సర్కార్ నిలిపివేసిందని సమాచారం. శనివారం వరకు తమ ఆస్తుల గురించి సమాచారం ఇవ్వని మొత్తం ఉద్యోగులలో ఎనిమిది శాతం మంది పబ్లిక్ వర్క్స్, రెవెన్యూ, బేసిక్, సెకండరీ ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్, కోఆపరేటివ్, ఎక్సైజ్, ఫుడ్ లాజిస్టిక్స్, మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్, రూరల్ ఇంజినీరింగ్, హార్టికల్చర్, పశుసంవర్ధక, రవాణా శాఖ మొదలైనవి శాఖలకు చెందిన వారు ఉన్నారు. ఆస్తి వివరాలు ఇవ్వని ఉద్యోగులకు ఫిబ్రవరిలో జనవరి జీతం అందదని వార్తలు వస్తున్నాయి.
READ ALSO: Health Tips: అన్నం Vs చపాతీ.. డయాబెటిస్ పేషెంట్స్‌కు ఏది మేలు? వైద్యులు చెబుతున్నది ఇదే!
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!