Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్ష
- పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థులు
- రైళ్ల కొరత, రైళ్ల ఆలస్యం కారణంగా తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థులు రైళ్ల కొరత, రైళ్ల ఆలస్యం కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురై ఆదివారం పాట్లీపుత్ర రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొందరు అభ్యర్థులు రైల్వే పట్టాలపైకి దిగి రైళ్లను అడ్డుకోవడంతో పాటు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు పోలీసు అధికారులు గాయపడినట్లు సమాచారం.
ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహించాల్సి ఉండటంతో, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది అభ్యర్థులు రాత్రికి రాత్రే పాట్లీపుత్ర స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే తగినన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులో లేకపోవడం, కొన్ని రైళ్లు ఆలస్యంగా నడవడంతో తాము పరీక్షకు సమయానికి చేరుకోలేమనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.
Also Read
- NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. పేడ కుప్పలో రూ.10 లక్షల క్యాష్! రంగంలోకి ‘SIT’..
ప్రత్యేక రైలు రాకతో ఉద్రిక్తత
పాట్లీపుత్ర నుంచి కతిహార్‌కు వెళ్లాల్సిన పరీక్షల ప్రత్యేక రైలు స్టేషన్‌కు చేరుకున్న సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహానికి గురైన అభ్యర్థులు రైలు ముందు పట్టాలపై కూర్చుని రైల్వే అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు రైలు రాకపోకలు స్తంభించిపోయాయి.
రాళ్ల దాడి.. రైలు ధ్వంసం
ఆందోళన కొనసాగుతున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసరడంతో పాటు రైలు బోగీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పలు పోలీస్ స్టేషన్ల నుంచి భారీగా పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకువచ్చారు.
ఐజీ సహా పలువురు పోలీసులకు గాయాలు
ఈ హింసాత్మక ఘటనలో ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) జితేంద్ర రాణా, రూపస్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బంది స్వల్ప గాయాలపాలైనట్లు సమాచారం. దీంతో అదనపు పోలీసు బలగాలను మోహరించి స్టేషన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఐజీ జితేంద్ర రాణా, దానాపూర్ ఎస్పీ, ఎస్డీఎం, ఏఎస్పీలతో పాటు పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలంలోనే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, అభ్యర్థులను శాంతింపజేసేందుకు పోలీసులు, రైల్వే అధికారులు సంయుక్తంగా ప్రయత్నాలు చేపట్టారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకుని అదనపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు, డబ్బే డబ్బు!
-
Vijay Deverakonda : నాగ చైతన్య ‘దూత’ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ… క్రేజీ కాంబినేషన్ లోడింగ్ ?
-
Trump US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన.. నేడే గుడ్ న్యూస్?
-
Astrology: చిన్న విషయాన్నీ ఎక్కువగా ఆలోచించే 4 రాశులవారు.. మీలో కూడా ఈ లక్షణం ఉందా?
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!