Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. పేడ కుప్పలో రూ.10 లక్షల క్యాష్! రంగంలోకి ‘SIT’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల లెక్కింపులో జరిగిన ఆర్థిక అక్రమాల వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఉదంతంపై రంగంలోకి దిగిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) ఒక యువకుడిని అదుపులోకి తీసుకోగా, మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఎస్ఓజీ పోలీసులు రుదౌలీ పరిధిలోని షుజాగంజ్ ప్రాంతానికి చెందిన లవ్ కుష్ మిశ్రా అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఇతని పాత్రపై ఆరా తీస్తున్నారు. అయితే దర్యాప్తు అధికారులకు షాక్ ఇస్తూ లవ్ కుష్ మిశ్రా ఇంట్లో తనిఖీ చేయగా.. ఏకంగా రూ.10 లక్షల కరెన్సీ నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఈ డబ్బులు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లోని పేడ (గోబర్) కుప్పలో దాచడం గమనార్హం.
రంగంలోకి సిట్ (SIT).. 15 రోజుల్లో ఫైనల్ రిపోర్ట్
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ సిట్ కమిటీ అధ్యక్షుడిగా లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ ఎన్నికయ్యారు. ఐపీఎస్ అధికారిణి కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ సిట్ బృందం 7 రోజుల్లోగా ప్రాథమిక నివేదికను, 15 రోజుల్లోగా పూర్తిస్థాయి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. కేవలం అదుపులోకి తీసుకున్న యువకుడే కాకుండా, కానుకల లెక్కింపు విధుల్లో పాల్గొన్న పలువురు ఆలయ ఉద్యోగులు కూడా ప్రస్తుతం దర్యాప్తు సంస్థల నిఘా నీడలో ఉన్నారు. ఈ అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయనేది తెలుసుకోవడానికి ఆలయ ప్రాంగణంలోని, కౌంటింగ్ హాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ వివాదం నడుస్తుండగానే, రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ (రిటైర్డ్ ఐఏఎస్) నృపేంద్ర మిశ్రా శనివారం అయోధ్యకు చేరుకుని నిర్మాణ పనులను సమీక్షించారు. అయితే ఈ దొంగతనంపై స్పందించడానికి ఆయన నిరాకరిస్తూ.. తన బాధ్యత కేవలం ఆలయ నిర్మాణ పనుల పర్యవేక్షణకే పరిమితమని స్పష్టం చేశారు. మరోవైపు యూపీ క్యాబినెట్ మంత్రి సూర్య ప్రతాప్ షాహీ స్పందిస్తూ.. “భక్తుల నమ్మకం, ఆరాధనతో ఎవరినీ ఆటలాడబోనివ్వం. ట్రస్ట్ ఇప్పటికే అంతర్గత విచారణ ప్రారంభించింది, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి” అని పేర్కొన్నారు.
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
తాజావార్తలు
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!