Warning to Drinkers: తాగుబోతుల పరువు హుష్‌కాకి.. 52 వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warning to Drinkers: 2016లో బీహార్ ప్రభుత్వం మద్యపానంపై నిషేధం విధించింది. ఈ ప్రకారం ఆ రాష్ట్రంలో మద్యం తయారు చేయడం, విక్రయించడం, సేవించటం నేరం. ఈ మేరకు సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు బీహార్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మందుబాబులను హెచ్చరిస్తూ వారి ఇళ్లకు పోస్టర్లు అంటిస్తోంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో పట్టుబడితే జరిమానా విధించడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తారు. కానీ బీహార్‌లో మాత్రం తాగుబోతులు సిగ్గుపడేలా ప్రభుత్వం ఊరంతా పోస్టర్లు అంటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తొలిసారి పట్టుబడితే అంతే సంగతులు. 2022 ఏప్రిల్ నుంచి గోపాల్ గంజ్ జిల్లాలో పట్టుబడిన మందుబాబుల ఇళ్లకు అధికారులు పోస్టర్లు అందిస్తున్నారు.
Read Also: డెంగీ రోగులకు ఈ ఆహారం అమృతమే..
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
గతంలో మందు తాగి తొలిసారి దొరికిన వారు జరిమానాతో తప్పించుకునేవారు అని.. ఆ సంగతి చుట్టుపక్కల వాళ్లు, బంధువులకు తెలిసేది కాదని అబ్కారీ శాఖ అధికారి రాకేష్ కుమార్ అన్నారు. అందుకే 2022 ఏప్రిల్ నుంచి మందు తాగుతూ దొరికిన వాళ్ల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్నామని తెలిపారు. అలా చేస్తే ఆ వ్యక్తి తాగుతున్నారని అందరికీ తెలుస్తుందని తమ ప్రయోగం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఇందులో భాగంగానే గోపాల్ గంజ్ జిల్లాలోని 52వేల ఇళ్లకు అధికారులు మందుబాబుల పోస్టర్లు అంటిస్తున్నారు. కాగా అంతకుముందు తాగి నేరానికి పాల్పడితే ఆస్తుల స్వాధీనం, జీవిత ఖైదు శిక్షలు ఖరారు చేశారు. అయితే 2018లో లిక్కర్ బ్యాన్ చట్టానికి బీహార్ ప్రభుత్వం సవరణలు చేసింది. శిక్షల నుంచి ఉపశమనం కలిగించింది. దీంతో మళ్లీ మందుబాబులు రెచ్చిపోతుండటంతో తాజాగా వాళ్ల పరువు తీసేలా చర్యలు చేపట్టింది.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!