బీజేపీ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తన శరీరంలో రక్తం ఉన్నంత వరకు బెంగాల్ ను విభజన కానివ్వనని కామెంట్స్ చేశారు. మంగళవారం ఉత్తర బెంగాల్ అలీపుర్ దూర్ లో ఆమె పర్యటించారు. ఓట్లు రాగానే బీజేపీ పార్టీ బెంగాల్ ను విభజస్తామని బెదిరిస్తోందని ఆమె ఆరోపించారు. బెంగాల్ విజభన కోసం బీజేపీ డిమాండ్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో ఉత్తర బెంగాల్ అభివృద్ధి జరిగిందని ఆమె అన్నారు.
ఎన్నికల ముందు గుర్ఖాలాండ్ చేస్తామని బీజేపీ చెప్పిందని.. ఇప్పుడు ఉత్తర బెంగాల్ ను విడదీస్తాం అంటోందని, మన ఐక్యంగా ఉందాం.. నా శరీరంలో రక్తం ఉన్నంత వరకు బెంగాల్ ను విభజించనివ్వను అని ఆమె అన్నారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
ఇదిలా ఉంటే బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కమతాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ( కేఎల్ఓ) చీఫ్ జిబోన్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ నేను మమతా బెనర్జీకి చెబుతున్నాను.. కమతాపూర్ లో అడుగు పెట్టవద్దు’ అని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై దీదీ స్పందించారు. ‘ ఉత్తర బెంగాల్ ను విభజించకుంటే నన్ను చంపేస్తామని చెబుతున్నారని..మీకు అధికారం ఉంటే నా ఛాతిపై తుపాకీ పెట్టండి.. నేను ఎన్నో తుపాకులను చూశాను’ అని అన్నారు.
కాగా.. ఇటీవల మమతా బెనర్జీ ఉత్తర బెంగాల్ లో పర్యటిస్తున్నారు. బీజేపీ ఆరోపణలకు చెక్ పెట్టడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆమె డార్జిలింగ్ వెళ్లారు. ప్రత్యేక గుర్ఖాలాండ్ ఉద్యమంలో కీలకంగా ఉన్న బిమల్ గురుంగ్, రోషన్ గిరిలు ఈ మధ్య సైలెంట్ అయ్యారు. తరుచుగా ఉత్తర బెంగాల్ ను సందర్శిస్తూ.. బెంగాల్ వేర్పాటువాద శక్తులను నిలవరించే ప్రయత్నం చేస్తున్నారు.