India Pak War: పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలను, వాటి శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100కు మించి ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం, పాక్ భారత్‌పై దాడికి పాల్పడింది. దీని తర్వాత మరోసారి ఇండియా తన విశ్వరూపాన్ని చూపించింది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ ఇలా ప్రధాన నగరాలు బాంబు మోతలతో దద్దరిల్లాయి.
అయితే, ఈ పరిణామాలు బంగ్లాదేశ్‌లో భయాన్ని పుట్టిస్తున్నాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ని తన పెద్దన్నగా భావిస్తోంది. భారత వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి దగ్గరవుతూ వచ్చింది. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారుల్ని బంగ్లాదేశ్ ఆహ్వానించింది. రెండు దేశాలు వాణిజ్య, ఇతర సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావించాయి.
Read Also: Nawaz Sharif: భారత్‌తో ఉద్రిక్తత.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ కీలక సలహా..
అయితే, ఇప్పుడు భారత్ దెబ్బకు పాకిస్తాన్ వణికిపోతుంది. పాక్ పరిస్థితి ఇలా ఉంటే భారత్‌తో పెట్టుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో అని బంగ్లాదేశ్ అనుకుందో ఏమో మార్పు కనిపిస్తోంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా బంగ్లాదేశ్‌ని వదిలి భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, బంగ్లా వ్యాప్తంగా హిందువులే టార్గెట్‌గా ఇళ్లు, ఆస్తులు, ఆలయాలు, వ్యాపారాలను మతోన్మాదులు టార్గెట్ చేశారు. భారత్ ఎన్ని సార్లు చెప్పినా, యూనస్ సర్కార్ అసలు హిందువుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు.
ఇప్పుడు యూనస్ సర్కార్ హిందూ కమ్యూనిటీ భద్రత కోసం స్థానిక పోలీసులు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్-పాక్ ఉద్రిక్తత ప్రభావం బంగ్లాదేశ్ హిందువులపై పడుతుందని యూనస్ సర్కార భయపడుతుంది. ఒకవేళ ఇదే జరిగితే ఇండియా ఊరుకునే పరిస్థితి ఉండదని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏదైనా అల్లర్లను నివారించడానికి బంగ్లాదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయం (PHQ) బుధవారం ఒక లేఖను జారీ చేసింది, మైనారిటీల భద్రతను నిర్ధారించాలని పోలీసు విభాగాలను ఆదేశిస్తోంది. హిందువులకు భారీ భద్రత కల్పించాలని బంగ్లా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
సరిహద్దు ప్రాంతాలు మరియు సోషల్ మీడియాపై నిఘా ఉంచడం హిందువులను లక్ష్యంగా చేసుకుని హింస, అశాంతిని ప్రేరేపించకుండా నిరోధించడానికి సరిహద్దు ప్రాంతాలలో భద్రతను పెంచాలని అధికారులు ఆదేశించారు. మొబైల్ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ కార్యకలాపాలు, సోషల్ మీడియా ఖాతాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.