Bangladesh: ‘‘జమాతే ఇస్లామీ’’పై నిషేధాన్ని ఎత్తేసిన బంగ్లాదేశ్.. షేక్ హసీనా హయాంలో బ్యాన్..
- జమాతే ఇస్లామీ పార్టీపై బ్యాన్ ఎత్తేసిన బంగ్లాదేశ్..
- షేక్ హసీనా హయాంలో నిషేధం..
- ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందనే ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: రిజర్వేషన్ కోటా రిజర్వేషన్ల రద్దు కోసం బంగ్లాదేశ్ అట్టుడికిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి ఎసరు పెట్టింది. ఈ ఆందోళనలు తీవ్రమైన హింసాత్మక చర్యలకు దారి తీయడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఆగస్టు 5న ఇండియా పారిపోయి వచ్చేసింది. ప్రస్తుతం నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా మైనారిటీలు ముఖ్యంగా హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి.
Read Also: Chandrababau: ఏపీ విషయంలో కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోంది..
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
బంగ్లాదేశ్ ఆందోళనలకు బీఎన్పీ పార్టీతో పాటు రాడికల్ భావాలు కలిగిన జమాతే ఇస్లామీ పార్టీ కార్యకర్తలు, వాటి అనుబంధ విద్యార్థి సంఘాలే కారణమని తెలుస్తోంది. షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్ందనే అభియోగాలపై ‘‘జమాతే ఇస్లామీ’’ని నిషేధించారు. అయితే, ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం బుధవారం ఈ సంస్థపై నిషేధాన్ని ఎత్తేసింది. జమాత్, దాని అనుబంధ సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్లు నిర్ధిష్ట ఆధారాలు లేవని చెప్పింది.
హింసను ప్రేరేపించామనే ఆరోపణల్ని జమాతే ఇస్లామీ పార్టీ ఖండించింది. నిషేధం ‘‘చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం’’ అని చెప్పింది. జమాత్ బంగ్లాదేశ్ లౌకిక రాజ్యాంగానికి విరుద్ధంగా రాజకీయ పార్టీగా నమోదు చేయబడిందని కోర్టు 2013లో పేర్కొన్న తర్వాత బంగ్లాదేశ్లో ఎన్నికల్లో పోటీ చేయలేకపోయింది. రిజిస్ర్టేషన్ను పునరుద్ధరించాలని కోరుతూ వచ్చే వారం ప్రారంభంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఆ పార్టీ తరపు న్యాయవాది శిశిర్ మోనీర్ తెలిపారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!