Renukaswamy murder case: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతడి స్నేహితురాలు పవిత్ర గౌడలకు రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ మంజూరైంది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి బెయిల్ పిటిషన్లను విచారించారు. ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు నాగరాజు, అనుకుమార్, లక్ష్మణ్, జగదీష్ అలియాస్ జగ్గా, ఆర్ ప్రదూష్ రావులకు బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Allu Arjun: నాంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట అల్లు అర్జున్?
బెయిల్ మంజూరు చేస్తూనే కోర్టు నిందితులకు షరతులు విధించింది. నిందితులు కోర్టు అధికార పరిధిని విడిచిపెట్టలేదరని, సాక్ష్యుల్ని సంప్రదించొద్దని, వారిని భయపెట్టొద్దని ఆదేశించింది. దర్శన్‌కి ఇప్పటికే ఆరోగ్య సమస్యల కారణంగా కోర్టు 6 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దర్శన్ ఇప్పటికే బయట ఉన్నారు, దర్శన్ మినహా మిగతా నిందితులు డిసెంబర్ 16న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా మరో 15 మందిపై ఆరోపణలు ఉన్నాయి. దర్శన్‌తో సన్నిహితంగా ఉంటున్న కారణంగా రేణుకాస్వామి పవిత్ర గౌడలకు అసభ్యకరమైన మెసేజులు పంపించడంతో ఈ హత్య చోటు చేసుకుంది. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, దర్శన్ అనుచరులు బెంగళూర్ తీసుకువచ్చారు. బెంగళూర్‌లోని కామాక్షి పాళ్య ప్రాంతంలోని షెడ్‌లో బంధించి దారుణంగా దాడి చేయడంతో అతను మరణించాడు. ఈ కేసు కర్ణాటకలో మాత్రమే కాకుండా యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది.