సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ముందుగా గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు అల్లు అర్జున్ ను కోర్టులో హాజరు పరిచారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని జడ్జి ఎదుట హాజరపరచగా ప్రస్తుతానికి వాదనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరొక పక్క సోమవారం వరకు ఈ కేసులో అరెస్టు చేయకూడదు అంటూ హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆ కేసుని మొదట రెండున్నర గంటలకు తర్వాత నాలుగు గంటలకు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టులో ఈ క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చిన తర్వాత వాదనలు జరుగుతాయా లేక ఇప్పటికే వాదనలు జరుగుతున్నాయా? అనే విషయం మీద క్లారిటీ లేదు.. ప్రస్తుతానికి అయితే కోర్టు హాల్ లోపలికి పోలీసులు అల్లు అర్జున్ తీసుకువెళ్లారు. అంతకు మించిన సమాచారం బయటకు రాలేదు. అయితే అల్లు అర్జున్ ను రిమాండ్ కి తరలిస్తారా? లేక క్వాష్ పిటిషన్ ను దృష్టిలోకి తీసుకుంటారా? అనేది న్యాయమూర్తి చేతుల్లోనే ఉందా? అనేది తెలియాల్సి ఉంది.