భారత దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైన బి.1.617 వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యపించింది. ప్రపంచంలోని 53 దేశాల్లో ఈ వేరియంట్ ఉన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. ఇండియాలో ఈ డబుల్ మ్యూటేషన్ వేరింట్ కారణంగా పాజిటీవ్ కేసులు, అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వేరియంట్ చెక్ పెట్టేందుకు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో 20 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ను అందించారు. జూన్ నుంచి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింతగా పెంచేందుకు ప్రభుత్వం సిద్దమైంది.