Killer Soup: కిల్లర్ సూప్.. తెలంగాణలో జరిగిన రియల్ కథ అని తెలుసా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Killer Soup: ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు, సిరీస్ లు వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా డాక్యుమెంటరీ రూపంలో నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు రియలిస్టిక్ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ మధ్యనే కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ ప్రేక్షకులను ఎంత మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు మరో వాస్తవిక కథతో నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే కిల్లర్ సూప్. మనోజ్ భాజ్ పాయ్, కొంకణీ సేన్ శర్మ జంటగా అభిషేక్ చౌబే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. హర్షద్ నలవాడే, అనంత్ త్రిపాఠి & ఉనైజా మర్చంట్‌తో కలిసి అభిషేక్ చౌబే నిర్మించారు. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ కథను 2017 తెలంగాణలో జరిగిన ఒక కేసు ఆధారంగా తెరకెక్కించారు. అప్పట్లో సంచలనం సృష్టించిన స్వాతి రెడ్డి కేసునే.. ఈ కథగా తెరకెక్కించారు.
నాగర్ కర్నూలు పట్టణంలో ప్రియుడి సాయంతో స్వాతి భర్త సుధాకర్ రెడ్డిని చంపేసింది. ఆ తరువాత భర్త స్థానంలో ప్రియుడు రాజేష్ ను పెట్టాలని అతడి ముఖంపై పెట్రోల్ పోసి నిప్పటించి.. యాసిడ్ ఎటాక్ లా క్రియేట్ చేసింది. యాసిడ్ దాడి తర్వాత తమ కుమారుడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సుధాకర్ రెడ్డి తల్లి భావించింది. కోడలికి తోడుగా ఆమె కూడా ఆస్పత్రిలోనే ఉంటోంది. అయితే కాలిన గాయాలు మానడానికి మటన్ సూఫ్ బాగా పనిచేస్తుందని సుధాకన్ తల్లికి ఎవరో చెప్పారు. అలాగే సుధాకర్ రెడ్డికి మటన్ అంటే బాగా ఇష్టం కూడా కావడంతో తల్లి మటన్ సూఫ్ చేసి ఆస్పత్రికి తీసుకువచ్చింది. అయితే సుధాకర్ రెడ్డి స్థానంలోని రాజేష్ ప్యూర్ వెజిటేరియన్ కావడంతో ఆ సూప్ తాగడానికి నిరాకరించాడు. మాంసాహారం ఇష్టంగా తినే సుధాకర్ ఇలా కాదనడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు స్వాతిని అరెస్ట్ చేశారు. ఇక కిల్లర్ సూప్ కూడా ఇలానే తీశారు. కానీ, కథ లైన్ మాత్రమే తీసుకున్నారు .. మొత్తం బాలీవుడ్ కు తగ్గట్టు మార్చారు. ఇక ఇందులో స్వాతిగా కొంకణా సేన్ నటించగా.. సుధాకర్, రాజేష్ గా మనోజ్ రెండు పాత్రల్లో కనిపించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
-
India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
-
Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
-
BYD Atto 8 EV: కేవలం 9 నిమిషాల్లో 97% ఛార్జింగ్! BYD కొత్త ఎలక్ట్రిక్ SUV.. 651 కి.మీ. రేంజ్‌తో వస్తోంది!
-
Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..