Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అశేష జనవాహిని హాజరైంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వగా.. సినీ, రాజకీయ, స్పోర్ట్స్, వ్యాపార ప్రముఖులు అతిథులుగా వచ్చారు. శతాబ్ధాల హిందువుల కల నేటితో నిజమైంది.
Read Also: Yogi Adityanath: అయోధ్యలో ఇకపై బుల్లెట్ల మోతలు, కర్ఫ్యూలు ఉండవు..ములాయం సింగ్‌పై విమర్శలు..
ఇదిలా ఉంటే అయోధ్యకు 1000 కిలోమీటర్ల దూరంలో ఒడిశాలోని మరో రామ మందిరం ఇదే రోజున ప్రారంభమైంది. సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై గొప్ప రామ మందిరం నిర్మితమైంది. ఓ వైపు అయోధ్య రామ మందిర కార్యక్రమాలు జరుగుతుంటే.. మరోవైపు ఒడిశా నయాఘర్‌లోని ఫతేగర్ గ్రామంలో మరో ఆలయం ప్రారంభమైంది.
165 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ ఆలయానికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఇచ్చిన విరాళాలతో ఆలయ నిర్మాణం పూర్తైంది. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధుల్లో సగం ఫతేగర్ వాసులే ఇచ్చారు. 2017లో ప్రారంభమై ఈ ఆలయంలో ఎంతో మంది పాలుపంచుకున్నారు. ఈ ఆలయం అనతి కాలంలోనే పర్యాటక క్షేత్రంగా మారుతుందని స్థానికులు భావిస్తున్నారు.
సాంప్రదాయ ఒడియా నిర్మాణ శైలిలో ఆలయం నిర్మితమైంది. కోణార్క్ వంటి ప్రసిద్ధ ఆలయాలను ఇది గుర్తుకు తెస్తుంది. ఆలయంలో సూర్యదేవుడు, శివుడు, గణేశుడు, హనుమంతుడిని కూడా ప్రతిష్టించారు. ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని ఇక్కడి ఆలయ కమిటీ చెప్పింది. ఈ పర్వతంపై గోవర్ధనుడు కొన్ని దశాబ్ధాలు పూజలు అందుకున్నాడని, 1912లో జగన్నాథుడి నవకళేబర సమయంలో సుదర్శన చెట్టను ఫతేఘడ్ నుంచి సేకరించినట్లు చెప్పారు.