Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ayodhya Mosque Plan Clears Major Hurdle

Ayodhya Mosque: అయోధ్య మసీదుకి అడ్డంకి క్లియర్.. ఆసుపత్రి కూడా!

Published Date :December 13, 2022 , 12:35 pm
By NTV WebDesk
Ayodhya Mosque: అయోధ్య మసీదుకి అడ్డంకి క్లియర్.. ఆసుపత్రి కూడా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ayodhya Mosque:2019లో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో (బాబ్రీ మసీదును కూల్చివేసిన) రామాలయం నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. అదే సమయంలో అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి వీలుగా ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత రామాలయం నిర్మాణం ప్రారంభం అవ్వగా.. ఇప్పుడు మసీదు పనులు కూడా మొదలు కాబోతున్నాయి. ఇన్నాళ్లూ స్థలం అనుమతి విషయాన్ని పెండింగ్‌లో ఉన్న వ్యవహారంపై అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ తాజాగా క్లియరెన్స్ ఇచ్చింది. అయోధ్య సమీపంలోని లక్నో-ఫైజాబాద్ హైవే పక్కనున్న దన్నిపూర్ గ్రామంలో మసీదుని నిర్మించబోతున్నారు.

Minister KTR: అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం

Also Read

  • Rs 397 Crore Transformer Scam: ​ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
  • JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్‌ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
  • PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
  • West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్‌లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు

మసీదు నిర్మాణం కోసం స్థలం అనుమతి కోసం ఎంతోకాలంగా వెయిట్ చేయగా.. ఎట్టకేలకు ఇన్నాళ్లకు అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి అనుమతి లభించిందని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ తెలిపారు. ఇంకా అగ్ని ప్రమాదం అనుమతి ఒక్కటే మిగిలుందని అన్నారు. తాము కేవలం మసీదుని మాత్రమే నిర్మించడం లేదని, 200 పడకల ఆసుపత్రిని కూడా తమకు మసీదు నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో కట్టబోతున్నట్టు ఆయన వెల్లడించారు. తొలి దశలో రూ. 100 కోట్లు, రెండో దశలో రూ.100 కోట్లు వెచ్చించనున్నామని పేర్కొన్నారు. ఈ టైంలోనే మసీదుకి సంబంధించి ఒక డిజైన్‌ని విడుదల చేశారు. అది ఎంతో అధునాతనంగా, ఆకర్షణీయంగా ఉండటంతో.. దాని గురించి నెట్టింట్లో చర్చలు కొనసాగుతున్నాయి.

Parliament Winter Session: చైనా-భారత్ ఘర్షణ.. లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ డిమాండ్

కాగా.. 1992 డిసంబర్ 6వ తేదీన ఒక కరసేవకుల గుంపు అయోధ్యలో ఉన్న 16వ శతాబ్దపు కట్టడం బాబ్రీ మసీదును కూల్చివేసింది. ఆరోజుల్లో దేశంలో నెలకొన్న మతపరమైన ఉద్రిక్తతలే ఈ సంఘటనకు దారి తీసింది. ఈ ఘటనలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్నుంచి ఈ వివాదాస్పద విషయం 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేదాకా కొలిక్కి రాలేదు. అంతకుముందు 2010 సెప్టెంబర్ 30వ తేదీన ఈ వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటిస్తూ.. అలహాబాద్ హైకోర్ట్ చారిత్రక తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు 2011లో స్టే విధించింది. 2017లో అలహాబాద్ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ.. విచారణకు ఆదేశాలిచ్చింది. 2019లో ఇరు వర్గాలకు న్యాయం చేస్తూ.. రామాలయం, మసీదుకి నిర్మాణాలకి స్థలాల్ని కేటాయించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Athar Hussain
  • Ayodhya Controversy
  • Ayodhya Development Authority
  • Ayodhya Mosque
  • Ram Mandir

తాజావార్తలు

  • Rs 397 Crore Transformer Scam: ​ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..

  • Redmi Pad 2: రెడ్‌మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే

  • JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్‌ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Raw Mango Chutney Recipe: సింపుల్‌గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ

  • Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions