Flights Delayed: ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్పోర్టులోనూ సాంకేతిక సమస్య.. నిలిచిపోయిన 400 విమానాలు..
- ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లోని ఏర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు..
- రెండు ఎయిర్ పోర్టుల్లో ఇప్పటి వరకు 400కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి..
- త్వరలోనే ఈ సమస్య పరిష్కరం అవుతుందని వెల్లడించిన ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flights Delayed: భారతదేశంలో అత్యంత బిజీగా ఉండే ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో ఏటీసీ సాంకేతిక సమస్యల కారణంగా గందరగోళం కొనసాగుతుంది. ఉదయం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపంతో గురువారం నుంచి విమానాలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 400కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్ లాంటి ఎయిర్‌లైన్‌లు ప్యాసింజర్లకు ముందస్తుగా అలర్ట్ జారీ చేశాయి. ఎయిర్ పోర్టు అధికారులు మాన్యువల్ ప్రక్రియలతో పని మొదలు పెట్టారు. కానీ సమస్య పూర్తిగా పరిష్కారం మాత్రం కాలేదు. మరోవైపు, ముంబై ఎయిర్ పోర్టులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో అక్కడి విమానాలపై కూడా ప్రభావితం అయ్యాయి.
Read Also: Pakistan: భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాకిస్తాన్..
Also Read
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
అయితే, ఎయిర్ పోర్టుల్లో ATC వ్యవస్థలోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టంలో లోపం తలెత్తినట్లు సమాచారం. ఈ వ్యవస్థ విమానాల ప్రణాళికలను ఆటోమేటిక్ గా సిద్ధం చేస్తుంది. ఈ వ్యవస్థలో సమస్యతో కంట్రోలర్లు మాన్యువల్‌గా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, గురువారం 513 విమానాలు, శుక్రవారం ఉదయం నుంచి 171 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఇక, ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో ఏటీసీలో లోపంతో వ్యవస్థ మొత్తం గందరగోళానికి గురైంది. కాగా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాన్యువల్ ప్రక్రియలతో పని చేస్తున్నట్లు తెలుస్తుంది. సాంకేతిక టీమ్‌లు మరమ్మతులు చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది, కానీ విమానాల ఆలస్యాలు కొనసాగవచ్చని అధికారులు తెలియజేశారు. ఈ సమస్య కారణంగా ప్రయాణికులు బోర్డింగ్ గేట్ల దగ్గర లాంగ్ క్యూలు, టెర్మినల్‌లలో వేచి చూస్తున్నారు. విమానాల్లో కూడా వెయిటింగ్ లిస్టు పెరిగింది. కాగా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పూణే లాంటి ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వీటిలో కొన్ని రద్దయ్యాయి.
Chatrapati Shivaji Maharaj International Airport, Mumbai, issues a passenger advisory following flight Operations at Mumbai Airport being affected by a technical issue impacting the Automatic Message Switching System (AMSS) at Delhi, which supports Air Traffic Control flight… pic.twitter.com/McP1jKkkLN
— ANI (@ANI) November 7, 2025
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!