అస్సాం సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ విక్రయాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తెలిపారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అస్సాంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం వడ్డించడం మరియు తినడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు ముఖ్యమంత్రి బుధవారం ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Delhi: అమిత్ షాను కలిసిన ప్రియాంకాగాంధీ.. దేనికోసమంటే..!
గతంలో దేవాలయానికి ఐదు కిలోమీటర్ల మేర బీఫ్ విక్రయాలను నిషేధించింది. తాజాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆదేశాలను జారీ చేసింది. 2021 పశు సంరక్షణ చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక పబ్లిక్ ఫంక్షన్లలో గానీ.. పబ్లిక్ ప్లేస్‌లో గానీ బీఫ్ తినకూడదని సూచించింది. బిల్లులోని నిబంధనలను ఉల్లంఘిస్తే మూడు నుంచి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
Briefing press after cabinet meeting at New Delhi https://t.co/w4DeAvko7f
— Himanta Biswa Sarma (@himantabiswa) December 4, 2024