త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పెట్టాలెక్కనుంది. సెప్టెంబర్‌లో రైలు ప్రారంభం అవుతుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కొత్త రైళ్లను ప్రవేశపెట్టిందని.. అందులో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ రాపిడ్ రైల్ వంటి కొత్త తరం రైళ్లను నడుపుతున్నామని వెల్లడించారు. త్వరలో వందే భారత్ స్లీపర్ రైలును కూడా ప్రవేశపెడుతున్నట్లు అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: USA: రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది..
ఆదివారం భావ్‌నగర్ టెర్మినస్‌లో అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా-పుణె ఎక్స్‌ప్రెస్, జబల్‌పూర్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లను వర్చువల్‌గా అశ్విని వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కర్యక్రమంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు మోహన్ యాదవ్, విష్ణు దేవ్ సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. భారతదేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసు వచ్చే నెలలో ప్రారంభమవుతుందని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Donald Trump: భారత్-పాక్ మధ్య “కాల్పుల విరమణ”కు నేనే కారణం.. ట్రంప్ నోట అదే మాట..
ఇక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు కూడా వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. తొలి బుల్లెట్ రైలు అతి త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటల 7 నిమిషాలకు తగ్గుతుందని చెప్పారు. దాదాపు 34000 కి.మీ కంటే ఎక్కువ కొత్త రైల్వే ట్రాక్‌లు వేయబడ్డాయని.. రోజుకు సుమారు 12 కి.మీ రైల్వే ట్రాక్‌లు వేస్తున్నట్లు వివరించారు. ఇది భారత రైల్వే చరిత్రలో మొదటిసారి అని తెలిపారు. ఇక బుల్లెట్ ట్రైన్.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) నుంచి ప్రారంభమై గుజరాత్‌లోని వాపి, సూరత్, ఆనంద్, వడోదర, అహ్మదాబాద్‌కు నడుస్తుందన్నారు. గంటకు 320 కి.మీ. వేగంతో నడుస్తుందని వివరించారు.
ఇక 1300 స్టేషన్లను పునరాభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి స్టేషన్‌లుగా మారుస్తున్నట్లు చెప్పారు. అలాగే పోర్బందర్ నుంచి రాజ్‌కోట్‌కు వాన్స్‌జాలియా, జెటల్సర్ మీదుగా కొత్త రైలు సర్వీసును త్వరలో ప్రవేశపెడతామని ప్రకటించారు. ఇక రణవావ్ స్టేషన్‌లో రూ. 135 కోట్ల వ్యయంతో అత్యాధునిక కోచ్ నిర్వహణ సౌకర్యాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
नमो भारत गाड़ी, जोकि आसपास के दो शहरों को जोड़ने वाली है। अपने अहमदाबाद और भुज के बीच एक चल रही है। और बिहार में जयनगर से पटना के बीच में, ये सब नए तरह की गाड़ियां हैं। बहुत जल्द ही वंदे स्लीपर आने वाली हैः माननीय रेल मंत्री श्री @AshwiniVaishnaw जी pic.twitter.com/QKjuxZzcCm
— Ministry of Railways (@RailMinIndia) August 3, 2025