Asha Bhosle: 10 ఏళ్లకే కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..
- ఆశాభోస్లే అస్తమయం..
- భారత సంగీతానికి తీరని లోటు..
- 10 ఏళ్లకే కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి..
- ఆశా జీవితంలో అనేక ఎత్తుపల్లాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asha Bhosle:భారత సంగీతం ఒక దిగ్గజ గాయనిని కోల్పోయింది. బాలీవుడ్ స్టార్ సింగర్ ఆశాభోస్లే ఆదివారం కన్నుమూశారు. 92 ఏళ్ల ఆశా శనివారం సాయంత్రం గుండెపోటుతో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చేరారు. ఆమె మరణంతో భారత సంగీత ప్రపంచం ఒక శకాన్ని కోల్పోయింది. 12,000కు పైగా పాటు, 20 భాషల్లో గానం చేయడం వంటి రికార్డులు ఆమె పేరిట ఉన్నాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె స్థానం సంపాదించారు. మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్ వంటి దిగ్గజాలతో ఆశాభోస్లే కలిసి పనిచేశారు. ఆర్‌డీ బర్మన్, ఎస్‌డీ బర్మన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్‌కి ఆమె పాటలు పాడారు. అనేక హిట్స్ అందించారు.
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ సోదరిగా కెరీర్ ప్రారంభించి ఆశాభోస్లే కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. కేవలం 10 ఏళ్ల వయసులో 1943లో ఆమె కెరీర్ ప్రారంభించారు. తన అక్కలాగే పాటలు పాడటం స్టార్ట్ చేశారు. తన కుటుంబాన్ని పోషించడం కోసం అక్క లతా మంగేష్కర్ తో కలిసి పాటలు పాడారు. మైక్రోఫోన్ అంటే ఏమిటో తెలియని సమయంలోనే 1943లో ఒక మరాఠీ సినిమాలో పాట పాడారు. 1948లో ‘‘చునారియా’’ సినిమాతో ఆశాభోస్లే బాలీవుడ్ అరంగ్రేటం చేశారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత
కేవలం 16 ఏళ్ల వయసులోనే లతా మంగేష్కర్ సెక్రటరీ అయిన గణప్రతాప్ భోస్లేను వివాహం చేసుకున్నారు. ఈ వివాహ నిర్ణయాన్ని ఆమె కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆశాభోస్లేకు 1957లో తొలి విజయం దక్కింది. ఆమె మహ్మద్ రఫీతో పాడిన ‘‘ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరీ’’ సాంగ్ భారీ విజయం సాధించింది. దీని తర్వాత ఆమె కెరీర్ పీక్స్‌కు వెళ్లింది. మరోవైపు, వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా సాగలేదు. పెళ్లి తర్వాత కొన్ని ఏళ్లకే భర్తతో విభేదాలు ప్రారంభమయ్యాయి. తన పిల్లలతో కలిసి భర్తకు దూరంగా జీవించడం ప్రారంభించింది. 1950 నుంచి 1980 వరకు ఆశాభోస్లే సంగీత ప్రపంచాన్ని ఏలారు.
ఆశాభోస్లే సంగీత దర్శకుడు ఆర్‌డీ బర్మన్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లకు వీరిద్దరు విడిపోయారు. అయితే, వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. తన అక్క లతా మంగేష్కర్‌తో ఆశాభోస్లే ఆత్మీయ సంబంధాన్ని కొనసాగించారు. 16 ఏళ్ల వయసులో పెళ్లి నిర్ణయం తర్వాత ఇద్దరి మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది. అయితే, ఆశాకు హేమంత్ భోస్లే జన్మించిన తర్వాత, కుటుంబం మళ్లీ కలిసింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!