Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basit Ali: దిగ్గజ నటుడు నానా పటేకర్ మరణవార్త విని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఇచ్చిన ఒక మంచి సలహాను ఇప్పటికీ తాను మర్చిపోలేనని చాలా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. నానా పటేకర్ మరణవార్త వినగానే ఎమోషనల్ అయ్యారు. ఉదయాన్నే ఈ వార్త వినగానే తనకు మైండ్ బ్లాంక్ అయిందని, చాలా పెద్ద షాక్‌కు గురయ్యానని చెప్పారు. నానా తనకు ఒక మంచి మిత్రుడని, ఒక లివింగ్ లెజెండ్ అని గుర్తు చేసుకున్నారు. కేవలం నటన వల్లే కాకుండా ఆయన వ్యక్తిత్వం, మంచి మనసు వల్లే నానా అందరి హృదయాల్లో నిలిచిపోతారన్నారు. 1994లో నానా పటేకర్‌తో తనకు పరిచయం ఏర్పడిందని, అప్పటినుంచి ఇద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగిందని తెలిపారు. నానా పటేకర్ తనతో పాత విషయాలు పంచుకోవడమే కాకుండా, తన తల్లితో కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడేవారని బాసిత్ అలీ చెప్పారు.
తన జీవితంలో నానా పటేకర్ ఇచ్చిన సలహాను బాసిత్ అలీ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. బాసిత్ అలీ తల్లి చనిపోయినప్పుడు నానా ఫోన్ చేసి, ‘బాసిత్, ఇకపై కొంచెం జాగ్రత్తగా ఉండు, నిన్ను నువ్వు చూసుకో’ అని చెప్పిన మాటలు ఇప్పటికీ తన మనసులోనే ఉన్నాయన్నారు. కష్టకాలంలో మనకు తోడుగా నిలిచే కొద్దిమంది వ్యక్తుల్లో నానా ఒకరని కొనియాడారు. అలాగే తన ఆరోగ్యానికి సంబంధించిన మరొక భావోద్వేగ సంఘటనను కూడా ఆయన పంచుకున్నారు. బాసిత్ అలీకి గుండె సంబంధిత సమస్య వచ్చి ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, నానా పటేకర్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందట. ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకుని, కోలుకున్నాక తనకు ఫోన్ చేయమని కోరారట. ఆ తర్వాత బాసిత్ ఆయనకు కాల్ చేసినప్పుడు, నానా చాలా సమయం కేటాయించి ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారని చెప్పారు. నానా పటేకర్ తెరపై ఎంత గొప్పగా కనిపిస్తారో, నిజ జీవితంలోనూ అంతకంటే గొప్పగా జీవించారని, మనుషులతో సంబంధాలకు, ఇతరుల పట్ల శ్రద్ధ చూపడానికి ఆయన ఎంతో విలువ ఇచ్చేవారని కొనియాడారు. నానా పటేకర్‌కు 75 ఏళ్ల వయసంటే ఎవరూ నమ్మలేరని, తాను ఆయనను ఎప్పుడూ సరదాగా ‘యంగ్ మ్యాన్’ అని పిలిచేవాడినని బాసిత్ గుర్తు చేసుకున్నారు. దానికి నానా కూడా నవ్వుతూ ‘నువ్వూ ముసలివాడివే, నేనూ ముసలివాడినే’ అని సరదాగా బదులిచ్చేవారట. నానా లాంటి ఒక మంచి మనిషిని కోల్పోవడం పూడ్చలేని లోటని, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని బాసిత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!