(సెప్టెంబర్ 22న పి.బి.శ్రీనివాస్ జయంతి) మనసు బాగోలేనప్పుడు తాము పి.బి.శ్రీనివాస్ పాటలు వింటూ ఉంటామని ఎందరో సంగీతంలో ఆరితేరిన పండితులు వ్యాఖ్యానించారు. దానిని బట్టే పి.బి.శ్రీనివాస్ గాత్ర మహాత్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రతివాది భయంకర శ్రీనివాస్ గానం ప్రతివాదులను భయపెట్టలేదు కానీ, వారి మనసులను సైతం కరిగించింది అని అభిమానులు అంటారు. తెలుగునాట పుట్టినా, పరభాషల్లోనే తనదైన బాణీ పలికించారు పి.బి.శ్రీనివాస్. మాతృభాషపై మమకారంతో ఎంత బిజీగా ఉన్నా, తెలుగు పాటలు పాడి పరవశించిపోయేవారు శ్రీనివాస్.…