Sheikh Shahjahan: పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్‌పై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పదుల సంఖ్యలో కేసులు ఉండటంతో పాటు ఇటీవల సందేశ్‌ఖలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు అక్కడి ప్రజలు ఉద్యమించారు. షేక్ షాజహాన్, అతని మద్దతుదారులకు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. మరోవైపు రేషన్ బియ్యం కుంభకోణంలో విచారణకు వెళ్లిన సమయంలో ఈడీ అధికారులపై ఇతడి అనుచరులు దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి షాజహాన్ పరారీలో ఉండగా.. కలకత్తా హైకోర్టు, గవర్నర్ అల్టిమేటంతో బెంగాల్ పోలీసులు ఇతడిని 50 రోజలు తర్వాత అరెస్ట్ చేశారు.
Read Also: Drushyam : దృశ్యం సినిమాకు అరుదైన గౌరవం..తొలి భారతీయ సినిమాగా గుర్తింపు..
షేక్ షాజహాన్‌ని అరెస్ట్ చేయాలంటూ బీజేపీ ఆందోళనను నిర్వహిస్తుండటంతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా టీఎంసీపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీఎంసీ పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నంలో షేక్ షాజహాన్‌ని పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ రెజ్లింగ్ బాస్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విషయంలో బీజేపీ ఇలాంటి చర్యలు తీసుకునే దమ్ముందా..? అంటూ టీఎంసీ ప్రశ్నిస్తోంది.