దృశ్యం సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా అన్ని భాషల్లోను వచ్చింది.. మలయాళం లో వచ్చిన దృశ్యం సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.. ఈ సినిమాను హాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్‌లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది.. ఇప్పటివరకు ఏ సినిమాకు దక్కని గౌరవం దక్కింది.. హాలివుడ్ లో రిమేక్ కానున్న తొలి భారతీయ సినిమాగా గుర్తింపు పొందింది..
ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు.. సినిమా కథ బాగుండటంతో అన్ని భాషల్లో భారీ సక్సెస్ ను అందుకుంది..
అంతేకాదు దృశ్యం సినిమా సిరీస్ లను కొరియన్ బాషల్లో కూడా రిమేక్ చేశారు.. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది.. ఇక హాలీవుడ్ నటించే నటీ నటులు ఎవరు అన్న విషయం తెలియాల్సి ఉంది..