West Bengal: బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరు నిందితులను పశ్చిమ బెంగాల్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. అయితే ఈ పరిణామం బెంగాల్‌లో రాజకీయ రచ్చకు దారి తీసింది.
Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని 42 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. దీదీ ప్రకటనలో బెంగాల్‌లో ఇండియా కూటమి లేదని స్పష్టంగా చెప్పింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తున్నాయి. బెంగాల్‌లో ఒంటరి పోరుకే మమత మొగ్గు చూపారు.
PM Modi: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతల అఘాయిత్యాలపై పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీ ప్రాంతం గత కొన్ని వారాలుగా అట్టుడుకుతోంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీఎంసీ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని అక్కడి మహిళలు, ప్రజలు ఆందోళనలు చేశారు. వీరికి బీజేపీ మద్దతు తెలిపింది. దాదాపుగా 55 రోజులుగా పరారీలో ఉన్న టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్‌ని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తా హైకోర్టు, గవర్నర్ సీరియస్ కావడంతో ఆ రాష్ట్ర పోలీసులు చర్యలు…
Calcutta High Court: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్‌ని ఎట్టకేలకు 50 రోజుల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కుంభకోణంలో విచారణ జరిపేందుకు వచ్చిన ఈడీ అధికారులపై ఇతని అనుచరులు దాడులకు తెగబడ్డారు. అంతే కాకుండా సందేశ్‌ఖలి ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో బెంగాల్‌లోని సందేశ్‌ఖలిలో మహిళలు, యువత టీఎంసీ లీడర్లకు వ్యతిరేకంగా ఉద్యమించింది. 55 రోజుల పరారీ తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Sheikh Shahjahan: పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్‌పై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పదుల సంఖ్యలో కేసులు ఉండటంతో పాటు ఇటీవల సందేశ్‌ఖలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు అక్కడి ప్రజలు ఉద్యమించారు.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో సందేశ్‌ఖలీ ప్రాంతంలో మహిళలు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. గత రెండు వారాలుగా ఈ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. మహిళల ఆందోళనలకు బీజేపీ మద్దతు ఇచ్చింది. సందేశ్‌ఖలి ఘటన లోక్‌సభ ఎన్నికల ముందు మమతా బెనర్జీకి తీవ్ర ఇబ్బందిగా మారింది.
Mimi Chakraborty: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత, మిమీ చక్రవర్తి తన ఎంపీ పదవకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.