ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధి ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి కూడా మంకీపాక్స్ అటాక్ అవుతోంది. తాజాగా దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. కేరళలో మంకీపాక్స్ లక్షణాలతో మరణించిన కొద్ది రోజుల తర్వాత, యూఏఈ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించడంతో మంకీపాక్స్ నిర్ధారణైంది.