Drink Own Urine: యూకే లోని హాంప్‌షైర్‌కు చెందిన హ్యారీ మటాదీన్ తన సొంత మూత్రాన్ని తాగడం అలవాటు చేసుకున్నాడు. తన మూత్రం తానే తాగడం వల్ల తాను పదేళ్లు యవ్వనంగా కనిపించానని చెప్పుకొచ్చాడు. మూత్రం తాగడం వల్ల తాను డిప్రెషన్ నుంచి దూరం అయ్యానని చెప్పుకొచ్చాడు. హ్యారీ తన మానసిక వ్యాధిని నయం చేసే ప్రయత్నంలో భాగంగా 2016లో తన సొంత మూత్రాన్ని తాగడం ప్రారంభించాడట. తన మూత్రం తానే తాగడాన్ని ‘యూరిన్ థెరపీ’ అని పేరు కూడా పెట్టాడు. యూరిన్ థెరపీ తనకు శాంతి, ప్రశాంతత, దృఢ సంకల్పాన్ని కనుగొనడంలో సహాయపడిందని అతను చెప్పాడు. తాను తాగే మూత్రం ఎంత శక్తివంతమైనదో తాను చెప్పలేనని తెలిపాడు. అది తాగిన క్షణం నుంచి తన మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభించిందదని తెలిపాడు.
Read also: TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు రిలీఫ్.. రెండు పరీక్షలను ఒకేచోట రాసేందుకు ఛాన్స్..
డిప్రెషన్‌ను దూరం చేస్తుందని పేర్కొన్నాడు. హ్యారీ ప్రతిరోజూ 200ml తన సొంత మూత్రాన్ని మాత్రమే తాగుతాడు. అతని రోజువారీ పానీయం సాధారణంగా నెలవారీ మూత్రంతో, కొంత తాజా మూత్రంతో కలుపుతారు. అంతేకాదు తన యూరిన్ సూపర్ క్లీన్ అంటూ కితాబు ఇచ్చాడు. వింతగా అనిపించినా, తన మూత్రం యొక్క వాసన, రుచి తనకు ఇష్టమని హ్యారీ చెప్పాడు. ప్రధానంగా తన మూత్రం తానే తాగడం వలన అతనికి ప్రయోజనాలను ఇస్తుంది, సంతోషపరుస్తుందని తెలిపాడు. హ్యారీ తన మూత్రాన్ని ఫేస్ మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగిస్తాడు. యూరిన్ థెరపీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి హ్యారీ ఆసక్తికర విషయాలు చెప్పాడు.
Read also: Nigeria : కూలిన రెండంతస్తుల పాఠశాల భవనం.. 22 మంది విద్యార్థులు మృతి, 132 మందికి గాయాలు
మూత్రం తాగడం వల్ల చర్మం యవ్వనంగా, మృదువుగా.. మెరుస్తూ ఉంటుందని చెప్పకొచ్చాడు. తాను ఇప్పటివరకు కనుగొన్న ఉత్తమ చర్మ సంరక్షణ ఉత్పత్తి రెండు నెలల మూత్రం అని అతను చెప్పాడు. మూత్రం తప్ప ఎలాంటి చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకోనని హ్యారీ చెప్పాడు. ఇంతకంటే షాకింగ్ ఏంటంటే.. అతనే కాదు అతని స్నేహితులు చాలా మంది ‘యూరిన్ థెరపీ’లో భాగమయ్యారని హ్యారీ చెప్పడంతో అందరూ షాక్ కు గురయ్యారు. నిజంగానే మన మూత్రం తాగితే డిప్రెషన్ బారిన పడకుండా ఉంటామా? అందానికి నిజమైన చిట్కా అదేనా? అని ప్రశ్నించుకునే విధంగా హ్యారీ చేస్తున్న పనిని మెచ్చుకోవాలో లేక ఆశ్చర్య పడాలలో తెలియడం లేదని కొందరు తెలిపారు.