Amritpal Singh: అమృత్ పాల్ సింగ్ సహాయకుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కొడుకుతో సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘ వారిస్ పంజాబ్ దే ’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం గత 10 రోజులుగా వేట సాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. అయితే ఆయన తప్పించుకు తిరుగుతున్నాడు. హర్యానా మీదుగా ఢిల్లీ చేరినట్లు తెలుస్తోంది. పూర్తిగా వేషధారణ మార్చి, తలపాగా తీసేసి మోడ్రన్ లుక్ తో తన రూపాన్ని మార్చుకుని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. నేపాల్ కు పారిపోయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేందుకు అమృత్ పాల్ సింగ్ ప్లాన్ చేస్తున్నాడు.
Read Also: Hit & Run Case: తార్నాకలో హిట్ & రన్.. ఆటోని ఢీకొన్న బెంజ్ కారు.. యజమాని పరార్
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
ఇదిలా ఉంటే అమృత్ పాల్ విషయంలో నెమ్మనెమ్మదిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అతడికి పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో పాటు విదేశాల్లో ఉన్న ఖలిస్తాన్ రాడికల్ సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. పాకిస్తాన్ తో పాటు విదేశాల నుంచి నిధులు అందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
తాజాగా అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు దల్జీత్ కల్సీకి పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కుమారుడు సాద్ బజ్వాతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌కి చెందిన సాద్ బజ్వా కంపెనీతో కల్సికి సంబంధం కలిగి ఉన్నాడు. రెండు నెలల క్రితం కల్సీ దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. కల్సీ దుబాయ్ లో ఉండేందుకు ఖలిస్తానీ ఉగ్రవాది లాండా హరికే ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాంబిహా గ్యాంగ్‌కు సన్నిహితుడైన గ్యాంగ్‌స్టర్‌తో కూడా కల్సి సంబంధం కలిగి ఉన్నాడు. కల్సి కొంతకాలం ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంజాబ్ మోడలింగ్, సినీ కాంట్రాక్ట్ లకు ఏజెంట్ గా పనిచేశాడు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!