Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
- కర్ణాటకలో SIR ప్రక్రియ పూర్తి..
- 1.08 కోట్ల మంది పేర్లు జాబితా నుంచి తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka SIR: కర్ణాటకలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision – SIR) అనంతరం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. SIRపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సమయంలో కర్ణాటకలో పూర్తైంది. ఈ ప్రక్రియలో 1.08 కోట్లకు పైగా ఓటర్ల వివరాలను జాబితా నుంచి తొలగించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.54 కోట్ల నుంచి 4.54 కోట్లకు తగ్గింది. ఇందులో 2,25,40,493 మంది పురుష ఓటర్లు (2.25 కోట్లు), 2,29,12,355 మంది మహిళా ఓటర్లు (2.29 కోట్లు) మరియు 2,841 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 18-19 ఏళ్ల వయస్సు వర్గానికి చెందిన ఓటర్లు 6.83 లక్షలకు పైగా ఉన్నారు.
తుది జాబితా రూపొందించే సమయానికి 1,08,76,625 ఎన్యూమరేషన్ ఫారాలను పరిగణనలోకి తీసుకోలేదని అధికారులు తెలిపారు. మరోవైపు, నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహించిన తర్వాత 61,867 మంది ఓటర్లను తుది జాబితాలో చేరేందుకు అనర్హులుగా గుర్తించారు. ముసాయిదా జాబితా వివరాల ప్రకారం.. ఎస్ఐఆర్ సవరణకు ముందు ఉన్న ఓటర్ల మొత్తం సంఖ్యలో 1,07,96,339 మంది (19.48 శాతం) వివరాలను ఎన్యూమరేట్ చేయలేపోయారు.
Also Read
- Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు.!
- Bombay High Court: ‘‘లీవ్ ఇండియా’’ నోటీసులపై ఇమ్రాన్ ఖాన్కు స్వల్ప ఊరట..
- Meerut Blue Drum Case: మీరట్ బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం.. ఉరిశిక్షపై అప్పీల్ స్వీకరణ.
- InnoData Layoffs: ఇన్నోడేటాలో భారీ ఉద్యోగ కోతలు.. భారత్లో 550 మందికి ఉద్వాసన?
ఫారాలు సమర్పించకపోవడం, గైర్హాజరు, వేరే ప్రాంతానికి వెళ్లిపోవడం, మరణించడం, ఒకటి కన్నా ఎక్కువ చోట్ల పేర్లు నమోదు కావడం వంటి అంశాలను కారణాలుగా చూపించింది. జాబితా నుంచి తొలగించిన పేర్లలో.. 65,45,679 మంది (11.81 శాతం) మంది శాశ్వతంగా వేరే ప్రాతానికి వెళ్లిన వారు, 19,00,926 మంది (3.43 శాతం) మంది గైర్హాజరైన వారిగా గుర్తించారు. 16,39,864 మంది (2.96 శాతం) మరణించిన వారిగా గుర్తించారు. 7,09,870 మంది (1.28 శాతం) మంది పేర్లు ఇప్పటికే రెండు చోట్ల ఉండటంతో వీరిని కూడా జాబితా నుంచి తొలగించారు.
కర్ణాటకలో ఈ ఏడాది జూన్ 30న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5.54 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించే బాధ్యతను బూత్ స్థాయి అధికారులు (BLOs) చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి, ఓటర్ల వివరాలను ధ్రువీకరించారు. 2002 తర్వాత కర్ణాటకలో చేపట్టిన ఎస్ఐఆర్ ఇదే.
తాజావార్తలు
-
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
-
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
-
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!