Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
- జీతం ఎక్కువగా ఉందని రాజీనామా కోరుతున్న మేనేజర్..
- సోషల్ మీడియాలో ఉద్యోగి ఆవేదన వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Employee: ఉద్యోగి జీతం పెరగాలని కోరుకుంటాడు. కానీ ఒక్కో సమయంలో ఈ జీతమే శాపమవుతుంది. తాజాగా బెంగళూర్‌కు చెందిన ఓ ఉద్యోగి ఆవేదన వైరల్ అవుతోంది. తనకు జీతం ఎక్కువగా ఉందనే కారణంతో మేనేజర్ రాజీనామా చేయాలని కోరుతున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన ఆవేదనను రెడ్డిట్‌లో పంచుకున్నారు. తన వర్క్‌లో ఎలాంటి లోపాలు లేకున్నా, కంపెనీ బడ్జెట్‌తో పోలిస్తే తన జీతం ఎక్కువగా ఉందనే కారణంతో కొత్త మేనేజర్ రిజైన్ కోరుతున్నాడని ఆయన ఆరోపించారు.
జీతం ఎక్కువైందని రాజీనామా..
తన కొత్త మేనేజర్ రెండు నెలల క్రితమే వచ్చాడని, ఉద్యోగుల పనితీరుపై సమీక్ష జరగకముందే రాజీనామా చేయాలని మేనేజర్ తన వెంట పడుతున్నాడని ఉద్యోగి ఆరోపిస్తున్నారు. జీతం ఎక్కువైందని జాబ్ కోల్పోతున్న పరిస్థితిపై సదరు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 24న జీతాలు పెంచాల్సి ఉందని, దీని కన్నా ముందే తనను వెళ్లిపోవాలని బలవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన జాబ్ అగ్రిమెంట్లో రెండు నెలల నోటీస్ వ్యవధి కూడా ఉందని, ఒక వేళ తాను స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే, కంపెనీ తనను తొలగిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే విషయంపై నెటిజన్ల నుంచి సలహాలు కోరారు.
Also Read
నెటిజన్లు ఇచ్చిన సలహాలు ఇవే..
ఉద్యోగి పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తొందరపడి రాజీనామా చేయవద్దని సూచిస్తున్నారు. మేనేజర్‌తో జరిగిన సంభాషనలు, రాజీనామా చేయాలని కోరిన సందర్భాలను రాతపూర్వకంగా భద్రపరుచుకోవాలని సూచించారు. అవసరమైన హెచ్ఆర్ను సంప్రదించాలని, ప్రస్తుతం ఉద్యోగంలో ఉంటూనే ఇతర ఉద్యోగాల కోసం సెర్చ్ చేయాలని సలహా ఇచ్చారు. కంపెనీ ఖర్చులు తగ్గించుకోవాలని అనుకుంటే, ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

Bengaluru
తాజావార్తలు
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నాబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
-
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
-
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!