Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shehbaz Sharif: జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా భారత్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని కార్యాలయంతో పాటు ఆయన వ్యక్తిగతంగా జమ్మూ కాశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ అక్టోబర్ 27, 2026ను ‘‘జమ్మూ కాశ్మీర్ బ్లాక్ డే’’గా పాటిస్తోంది. ఈ సందర్భంగా ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.
పాక్ పీఎంఓ ప్రకటనలో.. ‘‘79 సంవత్సరాల క్రితం, భారత సైన్యం శ్రీనగర్‌లో అడుగుపెట్టింది. ఇది జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఒక విషాద అధ్యాయానికి నాంది పలికింది, దాని గాఢమైన నీడ ఇప్పటికీ ఆ ప్రాంతంపై ఆవరించి ఉంది. అప్పటి నుండి, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు వారి ‘స్వీయ-నిర్ణయాధికారం’ నిరాకరించబడింది, ఈ హక్కును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంబంధిత తీర్మానాలలో గుర్తించింది.’’ అని ట్వీట్ చేశారు.
Also Read
- Donald Trump: ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన వ్యాఖ్యలు!
- Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
- దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
- China: సినిమా హీరోలా? సైన్స్ వీరులా? ప్రపంచానికి కళ్లు తెరిపించిన చైనా
షెహబాజ్ షరీఫ్ ఎక్స్ అకౌంట్లో.. ‘‘భారత ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు అపారమైన కష్టాలు, బాధలు, అణచివేతను ఎదుర్కొంటున్నారు అఅయినప్పటికీ తమ ప్రాథమిక హక్కులను సాధించాలనే వారి ధైర్యం, స్థైర్యం, సంకల్పం చెక్కుచెదరలేదు. తరతరాలుగా వారి త్యాగాలు స్వేచ్ఛ, గౌరవం, న్యాయం పట్ల వారికున్న ప్రగాఢ నిబద్ధతకు శక్తివంతమైన నిదర్శనం’’ అని అన్నారు. కాశ్మీరీ ప్రజల చట్టబద్ధమైన రాజకీయ గొంతును భారత్ అణచివేస్తున్నారని, వారి ఆకాంక్షలను నొక్కుతున్నారని ఆరోపించారు.
డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఈ రోజున, భారత బలగాలు శ్రీనగర్‌లో అడుగుపెట్టాయి, జమ్మూ కాశ్మీర్‌పై ఒక సుదీర్ఘ చీకటి అలుముకున్నాయని అబద్ధాలనున ప్రచారం చేశారు. కాశ్మీర్‌కు పాకిస్తాన్ ఎప్పుడూ అండగా ఉంటుందని జమ్మూ కాశ్మీర్ వివాదం పరిష్కారమయ్యే వరకు దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం అసాధ్యమని చెప్పారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు పాకిస్తాన్ నైతిక, దౌత్య, రాజకీయ మద్దతును కొనసాగిస్తుందని చెప్పారు.
Seventy-nine years ago today, Indian forces landed in Srinagar, and a long night fell over Jammu & Kashmir.
For nearly eight decades, the Kashmiri people have been denied their inalienable right to self-determination, a right affirmed by the UN Security Council. They have endured repression, incarceration and immense suffering, yet their resolve has never broken.
On this solemn day, I pay tribute to the countless Kashmiri men, women and children whose sacrifices keep the flame of freedom alive. Aspirations rooted in justice cannot be extinguished by coercion.
Pakistan stands with Kashmir today and always. We will continue our moral, diplomatic and political support until this dispute is resolved in accordance with UNSC resolutions and the will of the Kashmiri people.
#KashmirBlackDay
— Shehbaz Sharif (@CMShehbaz) October 27, 2026
తాజావార్తలు
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నాబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!