ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాతబస్తీలోని ఓ సివిల్ వివాదంలో తలదూర్చి, సెటిల్మెంట్ పేరిట భారీగా లంచం డిమాండ్ చేసిన మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కొండల్‌రావుతో పాటు ఓ కానిస్టేబుల్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ. 3 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
రూ. 10 లక్షల డిమాండ్.. రూ. 6 లక్షలకు ఒప్పందం
పోలీసు వర్గాలు, ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ పరిధిలోని ఓ స్థలానికి సంబంధించిన సివిల్ వివాదంలో ఇన్స్పెక్టర్ కొండల్రావు జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని అనుకూలంగా పరిష్కరించేందుకు బాధితుడి నుంచి తొలుత రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు అంత మొత్తం ఇవ్వలేనని వేడుకోవడంతో, చివరికి రూ. 6 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా (టోకెన్ అమౌంట్) రూ. 3 లక్షలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు.
Also Read
- Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
- Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
- Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
- Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
షాపులో డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత
బాధితుడు ఇన్స్పెక్టర్ వేధింపులు తాళలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళిక రచించిన అధికారులు మంగళవారం రంగంలోకి దిగారు. మీర్‌చౌక్ పరిధిలోని ఓ దుకాణంలో బాధితుడు రూ. 3 లక్షల నగదును ఇన్స్పెక్టర్ సూచన మేరకు అందిస్తుండగా, అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో సంబంధమున్న ఇన్స్పెక్టర్ కొండల్‌రావుతో పాటు ఒక కానిస్టేబుల్‌ను అధికారులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాతబస్తీలోని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేపట్టాయి. కేసు నమోదు చేసిన అధికారులు, నిందితులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఈ దాడితో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
-
Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!