Delhi: జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా! కేంద్రం సానుకూల సంకేతాలు
- జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా!
- కేంద్రం సానుకూల సంకేతాలు
- కేంద్రంతో సఖ్యతగానే ఉంటామన్న ఒమర్ అబ్దుల్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బుధవారం జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా కేబినెట్ తీర్మానించిన తీర్మాన పత్రాన్ని అమిత్ షాకు అందించారు. ఇటీవలే జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోదించారు. ఒమర్ అబ్దుల్లా అందించిన తీర్మాన పత్రంపై అమిత్ షా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇరువురి భేటీలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి సహకరిస్తామని.. అలాగే రాష్ట్ర హోదాను కూడా పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు భేటీ అనంతరం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణలు అక్కర్లేదని, సుపరిపాలన, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాల కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Pushpa 3 : పుష్ప 3 కూడా.. నిర్మాత సంచలనం
Also Read
బుధవారం సాయంత్రం అరగంటపాటు జరిగిన సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఒమర్ అబ్దుల్లా వర్గాలు తెలిపాయి. ఇక గురువారం సాయంత్రం ప్రధాని మోడీని కూడా ఒమర్ అబ్దుల్లా కలిసి తీర్మాన పత్రాన్ని అందజేయనున్నారు.
ఇది కూడా చదవండి: YS Jagan: ఒకసారి అమ్మ ఫోటో, మా చెల్లి ఫోటో.. మీ ఇళ్లలో పంచాయితీలు లేవా..?
జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌సీ- కాంగ్రెస్ కూటమి విజయం సాధించగా.. ఒమర్ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం ఆమోదించారు. తాజాగా కేంద్రం కూడా పచ్చజెండా ఊపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Swiggy Platform Fee: నిన్న జొమాటో.. నేడు స్విగ్గీ! ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేశాయిగా
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!