Amit Shah On No Confidence: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం రెండో రోజు చర్చ కొనసాగింది. చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో అమిత్ షా ప్రసంగిస్తూ మణిపూర్ ఘటనలు సిగ్గుచేటని అంగీకరిస్తూనే.. విపక్షాలకు కౌంటర్ ఇచ్చాడు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. అవిశ్వాసంపై రెండోరోజు కూడా వాడీవేడీ చర్చ సాగింది. సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన అనంతరం.. లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది.
Read also: Road Accident: కేబుల్ బ్రిడ్జి వద్ద పల్టీ కొట్టిన కారు.. నలుగురికి గాయాలు
అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భగా హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. రోజులో 17 గంటలు పని చేసే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే విపక్షాలు అవిశ్వాస తీర్మానం ముందుకు తీసుకొచ్చాయని మండిపడ్డారు. ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రజల్లో మద్దతు లేదని .. కేవలం గందరగోళం సృష్టించేందుకు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం పట్ల అమితమైన విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. అవిశ్వాసం ఒక రాజ్యాంగ ప్రక్రియ.. చర్చకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా అవిశ్వాసంతో కూటముల బలమెంతో తెలుస్తుందని అన్నారు. ప్రజలకు అంతా తెలుసునని.. వాళ్లు అంతా చూస్తున్నారని చెప్పిన అమిత్ షా.. ప్రజలకు తమపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.
Read also: LIC Scheme: ఎల్ఐసీ బంఫర్ ఆఫర్.. రోజుకు రూ.50 తో ఇన్వెస్ట్ చేస్తే.. రూ.6 లక్షలు మీ సొంతం..
ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపుల వైరల్ వీడియో గురించీ ప్రస్తావిస్తూ ‘‘ఆ వీడియోను పోలీసులకు ఇచ్చి ఉండాల్సింది. పార్లమెంట్ సమావేశాలకు ముందే వీడియో రిలీజ్ అయ్యిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మణిపూర్‌ను రాజకీయం చేశారని విమర్శించారు. తానే స్వయంగా మూడు రోజులపాటు మణిపూర్ వెళ్లానని.. అల్లర్ల ప్రాంతాల్ని సందర్శించిన మొదటి వ్యక్తిని తానేనని… మా సహాయ మంత్రి కూడా 23 రోజులపాటు పర్యటించారని చెప్పారు. మెయితీ, కుకీ వర్గాలతో చర్చిస్తున్నాం… త్వరలోనే మణిపూర్ పరిస్థితులను అదుపులోకి తెస్తామని హోం మంత్రి లోక్‌సభలో చెప్పారు. మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు బాధాకరమని.. మణిపూర్‌లో ఘటనలు సిగ్గు చేటని తామూ అంగీకరిస్తున్నామని అమిత్ షా తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అనంతరమే మణిపూర్‌లో హింస ప్రారంభం అయిందని.. మే 3వ తేదీన మొదలైన మణిపూర్ హింస నేటికీ కొనసాగుతోందని.. మణిపూర్ ఇష్యూలో దాచడానికి ఏం లేదు. ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని అమిత్ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ది కరప్షన్ క్యారెక్టర్ అని.. కానీ బీజేపీ విలువల కోసం సిద్ధాంతాల కోసం పోరాడే పార్టీ అని చెప్పారు. వచ్చే ఐదేళ్లలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌తిరుగులేని శక్తిగా మారుతుందన్నారు. మేకిన్ ఇండియా కాన్సెప్ట్‌ను రాహుల్ గాంధీతోపాటు అఖిలేష్ యాదవ్ కూడా తప్పుబట్టారని గుర్తు చేశారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ఇంకా ఉందంటూ విపక్షాలకు అమిత్ షా చురకలంటించారు. నాడు పీవీ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు నెగ్గారని.. డబ్బులిచ్చి అవిశ్వాసం గెలిచారనే ఆరోపణ కాంగ్రెస్‌పై ఉందని గుర్తు చేసిన అమిత్ షా.. వాజ్‌పేయి సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు నిజాయితీగా వ్యవహరించాం కాబట్టే ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయిందన్నారు.