China: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకే ప్రాంతాల్లోని తీవ్రవాద క్షేత్రాలపై దాడులు నిర్వహించింది. దీని తర్వాత, భారత్‌పైకి డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేసింది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని పెంచాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన మధ్య శనివారం సాయంత్రం నుంచి రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
Read Also: Pope Leo: భారత్-పాక్ కాల్పుల విరమణను స్వాగతించిన కొత్త పోప్..
ఈ ఉద్రిక్తతలు ఇలానే ఉన్న సమయంలో.. పాక్ మిత్రదేశం చైనా తన సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. చైనా తన విమానాలు, నావికా దళ నౌకలను తైవాన్ సమీపంలోకి తీసుకెళ్లాయి. ఈ విషయాన్ని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. పరిస్థితుల్ని క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. అంతకుముందు , శుక్రవారం తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పీపుల్ లిబరేషన్ ఆర్మీ(PLA)కి చెందిన 7 విమానాలు, 8 నేవీ నౌకలు, ఒక అనధికారిక నౌక తైవాన్ చుట్టూ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.