African Swine Fever: కేరళలో మరో వైరస్ కలకలం.. పందులను చంపేయాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
African swine fever found in Kerala: కేరళలో మరోసారి కొత్త వైరస్ బయటపడింది. ఇప్పటికే దేశంలో మంకీపాక్స్ వైరస్ కేసులు కేరళలోనే తొలుత బయటపడ్డాయి. తాజాగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు కేరళలో నమోదు అయినట్లు పశువర్థక శాఖ మంత్రి జే చించురాణి శుక్రవారం వెల్లడించారు. కేరళలోని వయనాడ్ జిల్లాలోని మనంతవాడి పందుల ఫారాల్లో ఈ వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇటీవల వరసగా పందులు మూకుమ్మడిగా చనిపోవడంతో పశువైద్యాధికారులు వీటి నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపారు. దీంతో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి సోకినట్లు వెల్లడైంది. దీంతో ప్రస్తుతం పందుల ఫారాల్లో ఉన్న 300 పందులను చంపేయాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు పరిసరాల్లో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని పందులను చంపాలని యోచిస్తున్నారు.
Read Also: Jamili Elections: జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన
Also Read
వయనాడ్ తో పాటు నార్త్ కేరళలో మరో జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. గతంలో బీహార్, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి సోకింది. తాజాగా కేరళలో ఈ వ్యాధి బయటపడింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పందులను ప్రభావితం చేస్తే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. ప్రస్తుతం కేసులు రావడంతో కేరళ అధికారులు అప్రమత్తం అయ్యారు. జంతువుల నుంచి మానవులకు ఈ వ్యాధి సంక్రమించడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నప్పటికీ.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వయనాడ్ జిల్లాతో పాటు కోజికోడ్ జిల్లా కూడా అలర్ట్ అయింది. అయితే బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వ్యాధి ఆనవాళ్లు కనిపించడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దీంతో కేరళ ప్రభుత్వం గత రెండు వారాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పందులు, వాటి మాంసాన్ని రవాణా చేయడాన్ని నిషేధించింది. ప్రజలు రెడ్ మీట్ ను తినడానికి ముందు బాగా ఉడికించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం… ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అటవీ, పెంపుడు పందుల్లో వ్యాపించే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన అంటువ్యాధి అని.. దీనివల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. మానవుకు కూడా ముప్పు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
తాజావార్తలు
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!