Modi Cabinet: అజిత్ పవార్‌కి మోడీ షాక్.. కేబినెట్‌లో దక్కని చోటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Cabinet: మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఇలా ప్రధానిగా బాధ్యతలు చేపడుతూ మోడీ రికార్డ్ సృష్టించారు. ఈ సారి ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాలకు మోడీ కేబినెట్‌లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన ఇలా ఎన్డీయే మిత్రపక్షాలకు కేబినెట్‌లో చోటు దక్కింది.
ఇదిలా ఉంటే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి మాత్రం భారీ షాక్ తగిలింది. ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీకి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఒకే సీటులో గెలిచింది. ఆ పార్టీ తరుపున సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ గెలిచారు. అయితే, ప్రఫుల్ పటేల్‌కి మోడీ కేబినెట్‌లో చోటు దక్కుతుందని అంతా భావించినప్పటికీ, ఆయనకు సహాయమంత్రి పదవి మాత్రమే ఇచ్చేందుకు బీజేపీ మొగ్గు చూపింది.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
Read Also: Modi 3.0 Cabinet: స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ రాణేలకు కేబినెట్‌లో దక్కని చోటు..?
ఇదిలా ఉంటే ఈ పరిణామంపై ప్రఫుల్ పటేల్ తన అనాసక్తిని బహిరంగంగా తెలిపారు. గతంలో తాను కేంద్రమంత్రిగా పనిచేశానని, సహాయమంత్రి పదవి దక్కడం తన పదవిని తగ్గించడమే అని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీకి చెప్పామని , కొన్ని రోజులు ఆగాలని కోరినట్లు చెప్పారు. దీనిపై అజిత్ పవార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తమకు ఒక లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఉన్నారని, రాబోయే 2-3 నెలల్లో రాజ్యసభలో 3 మంది సభ్యులు వస్తారని మొత్తం ఎంపీల సంఖ్య 4 అవుతుందని, తమకు కేబినెట్ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తామని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
ఎన్డీయే పెట్టుకున్న రూల్ ప్రకారం.. ఎవరైనా పార్టీ అధ్యక్షుడిగా ఉండీ, ఎంపీగా గెలుపొందిన వారికి కేబినెట్ పదవి ఇవ్వడం లేదా 10 మంది ఎంపీలు ఉన్నవారికి ఒక కేబినెట్ మంత్రితో పాటు ఒక సహాయమంత్రి పదవి ఇవ్వాలని ఒక ఫార్మూలా రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ విషయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అజిత్ పవార్ మహారాష్ట్రలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పార్టీ నుంచి కేవలం ప్రఫుల్ పటేల్ మాత్రమే గెలవడంతో సహాయమంత్రిని ఆఫర్ చేసినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!