Bangladesh Crisis: ఇవాళ బంగ్లాదేశ్‌కు ఎయిరిండియా ప్రత్యేక విమానం
- బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న ఆందోళనలు..
- విమాన సర్వీసులను యథావిధిగా నడిపిస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడి..
- నేడు ఒక ప్రత్యేక విమానాన్ని సైతం ఢాకాకు పంపబోతున్నట్లు ఎయిరిండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis: ఆందోళనలు కొనసాగుతున్న బంగ్లాదేశ్‌కు ఎయిరిండియా ఇవాళ (బుధవారం) విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. ముందే షెడ్యూల్ చేసిన సర్వీసులను యథావిధిగా నిర్వహిస్తామని తెలిపింది. విస్తారా, ఇండిగో సైతం అదే బాటలో వెళ్తున్నాయి. ఆ దేశ రాజధాని ఢాకాకు విమానాలు వెళ్తాయని పేర్కొనింది. మరోవైపు బంగ్లాలో ఉన్న భారతీయులను భారత్‌కు చేర్చేందుకు ఎయిరిండియా నేడు ఒక ప్రత్యేక విమానాన్ని సైతం ఢాకాకు పంపబోతున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పుకొచ్చాయి.
Read Also: Mega Year: 2024ను మెగా సంవత్సరంగా పిలుస్తున్న ఫ్యాన్స్. కారణం ఏంటంటే..?
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
అయితే, ఎయిరిండియా నిన్న (మంగళవారం) సాయంత్రం ఢాకాకు ఓ విమానాన్ని పంపింది. ఉదయం మాత్రం క్యాన్సిల్ చేసింది. ఈ సంస్థ రోజుకు రెండు విమానాలను ఢాకాకు నడిపిస్తుంది. విస్తారా ప్రతి రోజు ముంబయి నుంచి ఢాకాకు రెండు, ఢిల్లీ నుంచి ఢాకాకు వారానికి మూడు సర్వీసులను కొనసాగిస్తుంది. ఇండిగో ఢిల్లీ, ముంబయి, చెన్నై నుంచి ఢాకాకు రోజుకొక విమాన సర్వీసును నడిపిస్తున్నట్లు ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో విస్తారా, ఇండిగో సైతం మంగళవారం తమ రోజువారీ విమానాలను మాత్రం క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముందే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఆయా సంస్థలు తగిన ఆఫర్లను అందిస్తుంది.
Read Also: Mega Year: 2024ను మెగా సంవత్సరంగా పిలుస్తున్న ఫ్యాన్స్. కారణం ఏంటంటే..?
కాగా, బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. వారిలో 9 వేల మంది విద్యార్థులేనని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో విద్యార్థులు జులైలోనే భారత్‌కు తిరిగి వచ్చేశారని.. దౌత్యవేత్తల ద్వారా అక్కడున్న భారతీయులతో మాట్లాడుతున్నాం.. మైనారిటీల పరిస్థితులను నరేంద్ర మోడీ ప్రభుత్వం గమనిస్తుందని జై శంకర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్‌లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్‌కు గుడ్‌బై చెప్పిన ఓపెన్‌డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!