Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
- ఆరుగురు పిల్లలున్నంత మాత్రాన ఓటు హక్కు ఉండదా..?
- ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఓటర్ల జాబితా అప్డేట్ ప్రక్రియపై ఎంఐంఎ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంలో పిల్లల సంఖ్య ఆధారంగా ఓటర్లను గుర్తించే విధానాన్ని విమర్శించారు. భారతదేశంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి ఓటు హక్కును నిరాకరించే చట్టం లేదని స్పష్టం చేశారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారి కుటుంబాలను మ్యాపింగ్ చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఓటర్ల జాబితా మ్యాపింగ్ సమయంలో ఐదుగురుకి పైగా పిల్లలు ఉన్న కుటుంబాల వివరాలు మ్యాపింగ్ చేయడం లేదని చెబుతున్నారు. నాకే ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆరుగురు పిల్లలు ఉన్నవారు ఓటు వేయకూడదని ఏ చట్టంలో లేదు. ప్రధాని మోడీకి ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. హోం మంత్రి అమిత్ షాది కూడా పెద్ద కుటుంబమే. సీఎం యోగి కుటుంబంలో కూడా చాలా మంది సభ్యులు ఉన్నారు’’ అని ఓవైసీ అన్నారు. ప్రతీ భారతీయ పైరుడికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని ఓవైసీ గుర్తు చేశారు.
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ఓటర్ల జాబితా అప్డేట్లో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు ఆయన తెలిపారు. 2002, 2024 ఓటర్ల జాబితాను సరిచూస్తున్నారని, ఈ ప్రక్రియలో అనేక వ్యత్యాసాలు బయపడుతున్నాయని అన్నారు. ఒక వ్యక్తి, ఆయన తండ్రి మధ్య వయసు తేడా 15 ఏళ్లు ఉంటే ఎన్నికల సంఘం దానిని ఒక లోపంగా పరిగణిస్తోందని, తాత-మనవళ్ల మధ్య వయసు వ్యత్యాసాల విషయంలో కూడా ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
జూన్ 25 నుంచి జనాభా గణన పత్రాల పంపిణీ జరుగుతుందని, వీటిని ఇంట్లో ఉంచుకోకుండా, వెంటనే నింపి అధికారులకు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ పత్రాలను సమర్పించకపోతే, మీ పేరు ముసాయిదా జాబితాలో కనిపించదని, మీ చిరునామా మారితే ఫారం 8, మీ పేరు జాబితాలో లేకపోతే ఫారం 6 నింపి, పత్రాలపై సంతకాలు చేసి, బీఎల్ఓలకు సమర్పించాలని సూచించారు. ఇది కేవలం ఓటు హక్కు కోల్పోవడం గురించి మాత్రమే కాదని, మీ పౌరసత్వం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ఓటర్ జాబితాల నుంచి పేదలు, దళితులు, ముస్లింల పేర్లు తొలగించి వారికి దేశ పౌరసత్వం లేనివారిగా మార్చాలని దేశంలో కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
తాజావార్తలు
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!