Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి!
- సిక్ లీవ్ నిరాకరణతో విషాదం
- ఆఫీస్ వాష్‌రూమ్‌లో 29 ఏళ్ల యువతి మృతి
- ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వినలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాలోని ఒక ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న 29 ఏళ్ల మహిళ గ్సినా ధ్లాధ్లా (Gcina Dhladhla) ఆఫీసు వాష్‌రూమ్‌లో కూలిపోయి మృతి చెందారు. ఆమె పదేపదే సిక్ లీవ్ అడిగినా బాస్‌లు తిరస్కరించడం వల్ల ఈ దుర్మరణం జరిగిందని కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషాద ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యంతో బాధపడుతూ పలుమార్లు సిక్ లీవ్ కోరినప్పటికీ, సెలవులు మంజూరు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో 29 ఏళ్ల యువతి ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని గ్సీనా ఢ్లాధ్లా (Gcina Dhladhla)గా గుర్తించారు. ఆమె జోహన్నెస్‌బర్గ్‌లోని రోజ్‌బ్యాంక్ ప్రాంతంలో ఉన్న కార్‌ట్రాక్ (Cartrack) సంస్థలో కాల్ సెంటర్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు.
పలుమార్లు సిక్ లీవ్ కోరినా..
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, గ్సీనా గత కొద్ది రోజులుగా తీవ్ర అలసట, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రెండు సార్లు వైద్యుల సర్టిఫికెట్లతో పాటు సిక్ లీవ్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అయితే, ఆమె సెలవు అభ్యర్థనలను యాజమాన్యం తిరస్కరించిందని, ఆరోగ్యం బాగోలేకపోయినా విధులకు హాజరు కావాలని సూచించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
వాష్‌రూమ్‌లో కుప్పకూలి మృతి
జూన్ 6న గ్సీనా విధులకు హాజరైన సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సహోద్యోగులు తెలిపారు. కొంతసేపటి తర్వాత ఆమె ఆఫీస్ వాష్‌రూమ్‌లో కుప్పకూలిపోయారు. చాలాసేపు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు గమనించి చూడగా, ఆమె అపస్మారక స్థితిలో కనిపించారు. అనంతరం ఆమె మరణించినట్లు నిర్ధారించారు.
కుటుంబ సభ్యుల తీవ్ర ఆరోపణలు
మృతురాలి కుటుంబ సభ్యులు సంస్థపై పలు ఆరోపణలు చేశారు. గ్సీనా తీవ్రమైన ఒత్తిడి, అలసటతో బాధపడుతున్నప్పటికీ యాజమాన్యం స్పందించలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, సిక్ లీవ్ కోరినందుకు ఆమెకు హెచ్చరిక నోటీసు కూడా జారీ చేసినట్లు ఆరోపించారు. ఆరోగ్యం క్షీణించిన సమయంలో సరైన వైద్య సహాయం అందించడంలో కూడా ఆలస్యం జరిగిందని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.
కంపెనీ స్పందన
అయితే, ఈ ఆరోపణలను కార్‌ట్రాక్ సంస్థ ఖండించింది. సంస్థ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ లారెన్ హ్యూమన్ మాట్లాడుతూ, గ్సీనాకు ఎప్పుడూ సిక్ లీవ్ నిరాకరించలేదని స్పష్టం చేశారు. ఆమె గతంలో తీసుకున్న అనారోగ్య సెలవును కూడా ఆమోదించినట్లు తెలిపారు. అలాగే, ఆమె అస్వస్థతకు గురైన వెంటనే అత్యవసర వైద్య సేవలకు సమాచారం ఇచ్చామని, కార్యాలయంలో శిక్షణ పొందిన ఫస్ట్ రెస్పాండర్లు సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు.
ఉద్యోగుల సంక్షేమంపై మళ్లీ చర్చ
ఈ ఘటన దక్షిణాఫ్రికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంక్షేమం, కార్యాలయ ఒత్తిడి, సిక్ లీవ్ విధానాలపై చర్చకు దారితీసింది. ఉద్యోగుల ఆరోగ్య సమస్యలను సంస్థలు ఎంత సున్నితంగా పరిగణించాలి? అనారోగ్య పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గ్సీనా ఢ్లాధ్లా మరణానికి అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల ఆరోపణలు, సంస్థ వివరణల మధ్య నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే, ఈ విషాద ఘటన ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, పని-జీవిత సమతుల్యత వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
- Tags
- sick leave
- South Africa
- Woman
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!