Nagavamsi : బేబీ సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ జాక్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వైష్ణవి హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. గెస్ట్ గా వచ్చిన నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జాక్ సినిమా కేవలం కామెడీ మాత్రమే కాదు. ఇందులో చాలా రొమాన్స్ ఉంది. వెళ్లి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాను చూసి నవ్వుకోవడానికి వెళ్లండి. సిద్ధు నా తమ్ముడి లాంటి వాడు. వాడికి ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నా’ అన్నారు.
Read Also : CM Chandrababu Naidu: సీఎం ఏలూరు, కడప పర్యటనకు షెడ్యూల్ ఖరారు
‘వైష్ణవి చైతన్యను చివరిసారిగా పద్ధతిగా చూడటానికి ఈ మూవీకి వెళ్లండి. ఎందుకంటే ఆమె మా తర్వాత సినిమాలో హీరోయిన్. అందులో మరింత రఫ్ గా, ‘రా’గా చూపించబోతున్నాం. అందులో మొత్తం మోడ్రన్ బూతులే ఉంటాయి. అప్పుడు మరింత ఎంజాయ్ చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో వైష్ణవి మరింత రఫ్ గా కనిపించబోతోందని తెలుస్తోంది. అసలే బేబీ సినిమా తర్వాత బోల్డ్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. ఇప్పుడు నాగవంశీ మరింత మోడ్రన్ బూతులు అంటున్నాడు. చూస్తుంటే ఆ సినిమాలో వైష్ణవి రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇప్పటి నుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు.