గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలు బుధవారంతో ముగియనున్నాయి. మంగళవారం పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. నేటి సమావేశం ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి.
అహ్మదాబాద్ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో జరిగే సమావేశాల్లో పార్టీలో కీలకమైన నాయకత్వం, సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది. కీలకమైన రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రేపటి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో జరిగే సమావేశాల్లో.. మూలాల నుంచి పార్టీని పునరుద్ధరణ చేసే లక్ష్యంగా నేతలంతా సమాలోచనలు చేయనున్నారు. 64 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్‌లో సమావేశాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1938లో గుజరాత్‌లోని బర్దోలిలో, 1961లో భావనగర్‌లో ఏఐసీసీ సమావేశాలు జరిగాయి.