Tamil Nadu: వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అధికార డీఎంకేతో పాటు తమిళ స్టార్ విజయ్ పార్టీ టీవీకే, బీజేపీ, అన్నాడీఎంకేలు తమ తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. ఇదిలా ఉంటే, తమిళ ప్రజలు ఎవరిని సీఎంగా ఇష్టపడుతున్నారనే దానిపై సర్వే జరిగింది. సీఓటర్ సర్వే తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.
దక్షిణాదిలో డీలిమిటేషన్ వ్యవహారం కాకరేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో కేంద్రంపై పోరాటానికి దిగారు. ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లో డీఎంకే సభ్యులు పోరాటం చేస్తున్నారు. ఇటీవల చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది.
AIADMK: ఎంపీ ఎన్నికల్లో తమిళనాడు రూలింగ్ పార్టీ డీఎంకే మరోసారి క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోయింది. అయితే, ఆ పార్టీ ఓట్ల శాతం మాత్రం గణనీయంగా పెరిగింది.
AIADMK Leadership row: తమిళనాడు రాజకీయ పార్టీ ఏఐడీఎంకే పార్టీ చీఫ్ గా పళనిస్వామి ఉంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఉంటారని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే పార్టీపై తన అధిపత్యాన్ని నిలుపుకోవడానికి పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.